యాషెస్‌ ఐదో టెస్టు ఇంగ్లండ్‌దే

 England Beats Australia By 135 Runs - Sakshi

ఆస్ట్రేలియాపై 135 పరుగులతో గెలుపు

రాణించిన బ్రాడ్, లీచ్‌

2–2తో సిరీస్‌ సమం

సెంచరీతో పోరాడిన వేడ్‌

లండన్‌: ఆ్రస్టేలియాపై గెలవాలంటే స్టీవ్‌ స్మిత్‌ను సాధ్యమైనంత త్వరగా ఔట్‌ చేయాలి. యాషెస్‌ సిరీస్‌లో ఈ విషయం చాలా ఆలస్యంగా గ్రహించిన ఇంగ్లండ్‌... చివరకు అదే పని చేసి ఐదో టెస్టులో జయకేతనం ఎగురవేసింది. ఆదివారం ఇక్కడి ఓవల్‌ మైదానంలో ముగిసిన ఈ మ్యాచ్‌లో ఆతిథ్య జట్టు 135 పరుగుల తేడాతో ఆ్రస్టేలియాను ఓడించింది. నాలుగో రోజు 399 పరుగుల భారీ లక్ష్యం నిర్దేశించిన ఆ జట్టు... ప్రత్యరి్థని రెండో ఇన్నింగ్స్‌లో 263 పరుగులకే ఆలౌట్‌ చేసింది. దాదాపు రెండు రోజుల ఆట మిగిలి ఉన్న నేపథ్యంలో, అసాధారణంగా ఆడితేనే గెలవగల పరిస్థితుల్లో ఛేదనకు దిగిన కంగారూలు... పేసర్‌ స్టువర్ట్‌ బ్రాడ్‌ (4/62) జోరుకు ఓపెనర్లు వార్నర్‌ (11), హారిస్‌ (9) వికెట్లను త్వరగానే కోల్పోయారు.

వార్నర్‌ను పది ఇన్నింగ్స్‌లలో బ్రాడ్‌ ఏడుసార్లు ఔట్‌ చేయడం విశేషం. సిరీస్‌లో విశేషంగా రాణించిన వన్‌డౌన్‌ బ్యాట్స్‌మన్‌ లబõÙన్‌ (14), మాజీ కెపె్టన్‌ స్మిత్‌ (53 బంతుల్లో 23; 4 ఫోర్లు) కాసేపు ప్రతిఘటించారు. లబõÙన్‌ను లీచ్‌ (4/49), స్మిత్‌ను బ్రాడ్‌ ఔట్‌ చేశాక 85/4తో ఆసీస్‌ ఓటమి ఖాయమైపోయింది. అయితే, మాధ్యూ వేడ్‌ (166 బంతుల్లో 117; 17 ఫోర్లు, సిక్స్‌) సెంచరీతో ఎదురునిలిచాడు. దూకుడుగా ఆడుతూ పోయిన అతడు... మిచెల్‌ మార్ష్ (24)తో ఐదో వికెట్‌కు 63 పరుగులు, కెపె్టన్‌ టిమ్‌ పైన్‌ (21)తో ఆరో వికెట్‌కు 52 పరుగులు జోడించాడు. వీరిద్దరూ వెనుదిరిగాక మరింత ధాటిగా ఆడాడు. కానీ ఇంగ్లండ్‌  కెపె్టన్‌ రూట్‌ (2/26) పార్ట్‌టైమ్‌ స్పిన్‌తో అతడి ఆట కట్టించాడు. కాసేపటికే లీచ్‌ వరుస బంతుల్లో లయన్‌ (1), హాజల్‌వుడ్‌ (0)ను పెవిలియన్‌ చేర్చి గెలుపు లాంఛనాన్ని పూర్తి చేశాడు.

అంతకుముందు ఓవర్‌నైట్‌ స్కోరు 313/8తో రెండో ఇన్నింగ్స్‌ కొనసాగించిన ఇంగ్లండ్‌ మరో 16 పరుగులు జోడించి ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లతో ఆసీస్‌ను దెబ్బకొట్టిన  పేసర్‌ జోఫ్రా ఆర్చర్‌ (6/62)కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ దక్కింది. సిరీస్‌లో కేవలం ఏడు ఇన్నింగ్స్‌లోనే 774 పరుగులు చేసిన స్మిత్‌ ఆసీస్‌ తరఫున, 441 పరుగులు చేయడంతో పాటు 8 వికెట్లు తీసిన ఆల్‌రౌండర్‌ బెన్‌ స్టోక్స్‌ ఇంగ్లండ్‌ తరఫున ‘మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీస్‌’ అవార్డుకు ఎంపికయ్యారు. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 1, 4 టెస్టులను ఆ్రస్టేలియా నెగ్గింది. రెండో టెస్టు డ్రాగా ముగిసింది. 3, 5 టెస్టుల్లో ఇంగ్లండ్‌ విజయం సాధించింది. సిరీస్‌ 2–2తో సమమైనా... స్వదేశంలో జరిగిన గత యాషెస్‌ను గెల్చుకున్నందున ట్రోఫీ ఆ్రస్టేలియా వద్దనే ఉండనుంది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top