389 పరుగులకు ఇంగ్లండ్ ఆలౌట్ | England 389 all out | Sakshi
Sakshi News home page

389 పరుగులకు ఇంగ్లండ్ ఆలౌట్

May 22 2015 7:38 PM | Updated on Sep 3 2017 2:30 AM

న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో మొదటి ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ 389 పరుగులకు ఆలౌటైంది.

లార్డ్స్: న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో మొదటి ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ 389 పరుగులకు ఆలౌటైంది. 354/7 ఓవర్ నైట్ స్కోరుతో రెండు ఆట ప్రారంభించిన ఇంగ్లీషు టీమ్ మరో 35 పరుగులు జత చేసి మిగతా వికెట్లు కోల్పోయింది. జో రూట్ 98, బెన్ స్టోక్స్ 94 , బట్లర్ 67, మొయిన్ అలీ 54 అర్థ సెంచరీలతో రాణించారు. కెప్టెన్ కుక్ 16 పరుగులు చేశాడు.

కివీస్ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్, హన్సీ నాలుగేసి వికెట్లు పడగొట్టారు. సౌతీ, క్రెయిగ్ చెరో వికెట్ దక్కించుకున్నారు. తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన న్యూజిలాండ్ వికెట్ నష్టపోకుండా 145 పరుగులు చేసింది. ఓపెర్లు గప్టిల్(70), లాథమ్(59) అర్థ సెంచరీలతో ఆడుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement