ద్రవిడ్‌ స్థానాన్ని భర్తీ చేశారు.. | Dravid Set To Be Replaced As India A And U19 Coach | Sakshi
Sakshi News home page

ద్రవిడ్‌ స్థానాన్ని భర్తీ చేశారు..

Aug 29 2019 1:42 PM | Updated on Aug 29 2019 1:44 PM

Dravid Set To Be Replaced As India A And U19 Coach - Sakshi

ముంబై: సుమారు నాలుగేళ్ల  పాటు భారత్‌-ఏ, అండర్‌-19 జట్లకు ప్రధాన కోచ్‌గా పని చేసిన దిగ్గజ క్రికెటర్‌ రాహుల్‌ ద్రవిడ్‌.. ఇక నుంచి జాతీయ క్రికెట్‌ అకాడమీ(ఎన్‌సీఏ) హెడ్‌గా మాత్రమే కొనసాగనున్నారు. ఎన్‌సీఏ బాధ్యతల్ని భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు(బీసీసీఐ) ఇటీవల ద్రవిడ్‌కు అప్పచెప్పిన నేపథ్యంలో జూనియర్‌ జట్లకు ప్రధాన కోచ్‌గా వైదొలగాల్సి వచ్చింది. దాంతో ద్రవిడ్‌ స్థానాన్ని ఇద్దరి కోచ్‌లతో  భర్తీ చేశారు. భారత-ఏ ప్రధాన కోచ్‌గా సితాన్షు కోటక్‌ను నియమించగా, పారస్‌ మాంబ్రేను అండర్‌-19 జట్టు ప్రధాన కోచ్‌గా ఎంపిక చేశారు.

భారత-ఏ, అండర్‌-19 జట్లుకు ద్రవిడ్‌తో కలిసి పని చేసిన అనుభవం పారస్‌ మాంబ్రేకు ఉంది. దాంతో మాంబ్రేను అండర్‌-19 ప్రధాన కోచ్‌ ఎంపిక చేయడానికి మార్గం సుగమం అయ్యింది. మరొకవైపు130 ఫస్ట్‌కాస్ల్‌ మ్యాచ్‌లు ఆడిన అనుభవం కోటక్‌ది. అయితే వీరిద్దరూ కేవలం రెండు నెలల పాటు మాత్రమే కోచ్‌లుగా కొనసాగిస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. 2015లో భారత జూనియర్‌ జాతీయ జట్లకు కోచ్‌గా ద్రవిడ్‌ను నియమించిన సంగతి తెలిసిందే.  కింది స్థాయిలో ఆటగాళ్లను వెలికితీసి జాతీయ జట్టుకు అందించడంలో ద్రవిడ్‌ సక్సెస్‌ అయ్యాడు. ప్రస్తుతం పలువురు యువ క్రికెటర్లు అంతర్జాతీయ స్థాయిలో ఆడుతున్నారంటే అందుకు ద‍్రవిడ్‌ పర్యవేక్షణ కూడా ఒక ప్రధాన కారణం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement