వారెవ్వా కార్తీక్‌.. వాటే క్యాచ్‌!

Dinesh Karthik Stunning Catch In First T20 Against New Zealand - Sakshi

వెల్లింగ్టన్‌ : న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టీ20లో టీమిండియా క్రికెటర్‌ దినేష్‌ కార్తీక్‌ కళ్లు చెదిరే క్యాచ్‌తో ఔరా అనిపించాడు. క్యాచ్‌ అందుకోవడమే కాకుండా సిక్స్‌ను అడ్డుకున్నాడు. బౌండరీ లైన్‌ వద్ద కార్తీక్‌ చేసిన ఈ ఫీట్‌కు మైదానంలోని ఆటగాళ్లు, అభిమానులు అవాక్కయ్యారు. 

హార్దిక్‌ పాండ్యా వేసిన 16వ ఓవర్‌ చివరి బంతిని కివీస్‌ అరంగేట్ర ఆటగాడు డెరిల్‌ మిచెల్ అవుట్‌ సైడ్‌ ఆఫ్‌ దిశగా భారీ షాట్‌ ఆడాడు. ఆ దిశలో బౌండరీ లైన్‌ వద్ద ఫీల్డింగ్‌ చేస్తున్న దినేష్‌ కార్తీక్‌ బంతిని చాకచక్యంగా అందుకున్నాడు. అయితే సమన్వయం కోల్పోతున్నట్లు భావించిన కార్తీక్‌.. బంతిని గాల్లోకి విసిరేసి మళ్లీ వచ్చి అందుకున్నాడు. కానీ ఈ క్యాచ్‌పై థర్డ్‌ అంపైర్‌ నిర్ణయం ప్రకటించే వరకు దినేష్‌ కార్తీక్‌ స్పష్టం చేయలేకపోయాడు. బంతి అందుకునే సమయంలో.. విడిచే సమయంలో మళ్లీ అందుకునే సమయంలో అతను బౌండరీ లైన్‌ను తాకలేదని సమీక్షలో స్పష్టం కావడంతో థర్డ్‌ అంపైర్‌ ఔట్‌గా ప్రకటించాడు. దీంతో డెరిల్‌ విచెల్‌ నిరాశగా వెనుదిరిగాడు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top