అభిమానులు మోసపోయారు | Cricket fans feel cheated with IPL betting scandal: HC | Sakshi
Sakshi News home page

అభిమానులు మోసపోయారు

Aug 7 2013 2:47 AM | Updated on Sep 1 2017 9:41 PM

అభిమానులు మోసపోయారు

అభిమానులు మోసపోయారు

అంతర్జాతీయంగా శాఖోపశాఖలుగా విస్తరించిన ఐపీఎల్-6 బెట్టింగ్ ఉదంతం వల్ల క్రికెట్‌ను విపరీతంగా ఇష్టపడే అభిమానులు మోసపోయారని బాంబే హైకోర్టు వ్యాఖ్యానించింది.

ముంబై: అంతర్జాతీయంగా శాఖోపశాఖలుగా విస్తరించిన ఐపీఎల్-6 బెట్టింగ్ ఉదంతం వల్ల క్రికెట్‌ను విపరీతంగా ఇష్టపడే అభిమానులు మోసపోయారని బాంబే హైకోర్టు వ్యాఖ్యానించింది. బెట్టింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న జైపూరి బ్రదర్స్ పవన్, సంజయ్‌లు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా జస్టిస్ సాధన జదేవ్ ఈ వ్యాఖ్యలు చేశారు.
 
 బాలీవుడ్ యాక్టర్ విందూ సింగ్, పాక్ అంపైర్ అసద్ రవూఫ్‌లతో కలిసి జైపూరి బ్రదర్స్ బెట్టింగ్‌కు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. గాంబ్లింగ్ నిరోధక చట్టం ప్రకారం తమ క్లయింట్ చేసిన నేరానికి బెయిల్ ఇచ్చే అర్హత ఉందని సీనియర్ న్యాయవాది అమిత్ దేశాయ్... బ్రదర్స్‌లో ఒకరి తరఫున వాదించారు. అయితే దీనిపై స్పందించిన జస్టిస్ జదేవ్... ‘బెయిలబుల్ నేరమే అయినప్పటికీ దాని వల్ల సాధారణ ప్రజలు చాలా మంది మోసపోయారు’ అని అన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement