చందనకు రెండు స్వర్ణాలు | Chandana gets Two Gold Medals | Sakshi
Sakshi News home page

చందనకు రెండు స్వర్ణాలు

Sep 25 2018 10:28 AM | Updated on Sep 25 2018 10:28 AM

Chandana gets Two Gold Medals - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ప్రపంచ కిక్‌ బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ ప్లేయర్లు పి. చందన, మైత్రి సత్తా చాటారు. ఇటలీ వేదికగా జరిగిన ఈ టోర్నీలో వీరిద్దరూ భారత్‌కు 3 పతకాలను అం దించారు. మంచిర్యాలకు చెందిన పదేళ్ల చందన రెండు స్వర్ణాలను కైవసం చేసుకోగా... నగరానికి చెందిన మైత్రి కాంస్యంతో ఆకట్టుకుంది. మ్యూజికల్‌ ఫామ్, మ్యూజికల్‌ వెపన్‌ ఫామ్‌ విభాగాల్లో చందన విజేతగా నిలిచి పసిడి పతకాలను అందుకుంది. క్యాడెట్‌ కేటగిరీలో మైత్రి మూడోస్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని సాధించింది.

సోమవారం భారత్‌కు చేరుకున్న వీరిద్దరూ తెలంగాణ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ కిక్‌ బాక్సింగ్‌ సంఘం అధ్యక్షుడు రామాంజనేయులు వీరిద్దరినీ అభినందించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement