breaking news
boxing games
-
చందనకు రెండు స్వర్ణాలు
సాక్షి, న్యూఢిల్లీ: ప్రపంచ కిక్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ ప్లేయర్లు పి. చందన, మైత్రి సత్తా చాటారు. ఇటలీ వేదికగా జరిగిన ఈ టోర్నీలో వీరిద్దరూ భారత్‌కు 3 పతకాలను అం దించారు. మంచిర్యాలకు చెందిన పదేళ్ల చందన రెండు స్వర్ణాలను కైవసం చేసుకోగా... నగరానికి చెందిన మైత్రి కాంస్యంతో ఆకట్టుకుంది. మ్యూజికల్ ఫామ్, మ్యూజికల్ వెపన్ ఫామ్ విభాగాల్లో చందన విజేతగా నిలిచి పసిడి పతకాలను అందుకుంది. క్యాడెట్ కేటగిరీలో మైత్రి మూడోస్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని సాధించింది. సోమవారం భారత్‌కు చేరుకున్న వీరిద్దరూ తెలంగాణ భవన్లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ కిక్ బాక్సింగ్ సంఘం అధ్యక్షుడు రామాంజనేయులు వీరిద్దరినీ అభినందించారు. -
రహమాన్‌కు స్వర్ణం
హబీబ్‌కు రజతం సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ గ్రామీణ క్రీడల బాక్సింగ్ పోటీల్లో హైదరాబాద్ కుర్రాళ్లు అబ్దుల్ రహమాన్, హబీబ్ వుర్ రహమాన్ మెరిశారు. గుజరాత్‌లోని జై జలల్రామ్ ఇంటర్నేషనల్ స్కూల్ గ్రౌండ్సలో జరిగిన ఈ పోటీల్లో అబ్దుల్ రహమాన్ బంగారు పతకం సాధించాడు. అండర్-17 బాలుర విభాగంలో జరిగిన 44-46 కేజీ కేటగిరీలో అతను విజేతగా నిలిచాడు. అండర్-19 విభాగంలో నిర్వహించిన 46-48 కేజీల కేటగిరీలో హబీబ్ ఫైనల్లో ఓడి రజతంతో సరిపెట్టుకున్నాడు.