కెరీర్ బెస్ట్ ర్యాంకుల్లో జింబాబ్వే ఆటగాళ్లు | carrer best rank zimbabwe players | Sakshi
Sakshi News home page

కెరీర్ బెస్ట్ ర్యాంకుల్లో జింబాబ్వే ఆటగాళ్లు

Sep 16 2013 1:47 AM | Updated on Sep 1 2017 10:45 PM

ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో జింబాబ్వే ఆటగాళ్లు కెరీర్ బెస్ట్ ర్యాంకింగ్‌కు ఎగబాకారు. పటిష్టమైన పాకిస్థాన్‌తో జరిగిన రెండో టెస్టులో సంచలన విజయం సాధించడం ద్వారా జింబాబ్వే క్రికెటర్ల ర్యాంకులు మెరుగయ్యాయి.

దుబాయ్: ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో జింబాబ్వే ఆటగాళ్లు కెరీర్ బెస్ట్ ర్యాంకింగ్‌కు ఎగబాకారు. పటిష్టమైన పాకిస్థాన్‌తో జరిగిన రెండో టెస్టులో సంచలన విజయం సాధించడం ద్వారా జింబాబ్వే క్రికెటర్ల ర్యాంకులు మెరుగయ్యాయి.
 
 బ్యాటింగ్ విభాగంలో కెప్టెన్ బ్రెండన్ టేలర్ ఏకంగా 15 స్థానాలు మెరుగుపర్చుకొని కెరీర్ బెస్టు 25వ స్థానానికి ఎగబాకాడు. హమిల్టన్ మసకద్జా 40 స్థానాలు మెరుగుపర్చుకొని 66వ ర్యాంకుకు చేరాడు. పాకిస్థాన్ బ్యాట్స్‌మెన్ మిస్బా మూడు స్థానాలు ఎగబాకి 12వ, యూనిస్ ఖాన్ 6వ ర్యాంకుల్లో కొనసాగుతున్నారు. బౌలింగ్‌లో జింబాబ్వే ఆటగాళ్లు చతారా 21 స్థానాలు మెరుగుపర్చుకొని కెరీర్ బెస్ట్ 55వ ర్యాంకుకు చేరాడు.

Advertisement
 
Advertisement
Advertisement