
\ముంబై:న్యూజిలాండ్ తో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా తడబడుతూ బ్యాటింగ్ చేస్తోంది. ఆరు ఓవర్లలోపే ఓపెనర్లు శిఖర్ ధావన్(9), రోహిత్ శర్మ(20) వికెట్లను కోల్పోయిన భారత్..ఆపై ఆచితూచి ఆడుతోంది. క్రీజ్ లో పరుగుల మెషీన్ విరాట్ కోహ్లి ఉన్నప్పటికీ బౌండరీలు రావడం కష్టంగా మారింది. పది ఓవర్ల ముగిసే సరికి భారత్ ఒక ఫోర్ ను మాత్రమే సాధించడమే అందుకు ఉదాహరణ. ఆ ఫోర్ ను తొలి వికెట్ గా అవుటైన శిఖర్ ధావన్ కొట్టాడు. కాగా, 10 ఓవర్లలో భారత జట్టు రెండు సిక్సర్లు సాధించింది.
దూకుడుగా ఆడిన రోహిత్ శర్మ రెండు సిక్సర్లను తన ఖాతాలో వేసుకున్నాడు. 11 ఓవర్లు ముగిసే సరికి భారత్ స్కోరు 48/2. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత జట్టు తొలుత బ్యాటింగ్ తీసుకుంది. న్యూజిలాండ్ పేసర్ ట్రెంట్ బౌల్ట్ నిప్పులు చెరిగే బంతులతో ఆదిలోనే భారత ఓపెనర్లను పెవిలియన్ కు పంపాడు.