భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీ మంగళవారం నుంచి ప్రారంభం కానుంది.
భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీ మంగళవారం నుంచి ప్రారంభం కానుంది. ఉదయం 5.30 గంటలకు అడిలైడ్ నగరంలో తొలి టెస్టు మొదలువుతంది. కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అన్ ఫిట్ అని తేలడంతో.. భారత స్టార్ బ్యాట్స్ మన్ విరాట్ కోహ్లీకి పగ్గాలు అప్పగించారు. వృద్ధిమాన్ సాహా వికెట్ కీపర్గా వ్యవహరిస్తాడు. గాయంతో భువనేశ్వర్ కుమార్ కూడా ఈ టెస్టుకు దూరంగా ఉన్నాడు.
ఇశాంత్ శర్మ, వరుణ్ ఆరోన్, షమీ త్రయం పేస్ బౌలింగ్ దాడిని పంచుకుంటారు. ఇక ఆస్ట్రేలియా జట్టు మాత్రం బౌన్సర్లు సంధించే బౌలర్లతో ఈ మ్యాచ్ కోసం సన్నద్ధమైంది. సిడిల్, మిషెల్ జాన్సన్, హ్యారిస్ ఆస్ట్రేలియా జట్టులో ఉండనున్నారు. అలాగే షేన్ వాట్సన్, మిషెల్ మార్ష్ లాంటి ఆల్ రౌండర్లు కూడా ఆసీస్ జట్టుకోసం సిద్ధమయ్యారు.