డీఆర్‌ఎస్‌కు బీసీసీఐ ఓకే | bcci ok for drs | Sakshi
Sakshi News home page

డీఆర్‌ఎస్‌కు బీసీసీఐ ఓకే

Oct 22 2016 4:30 AM | Updated on Sep 4 2017 5:54 PM

డీఆర్‌ఎస్‌కు బీసీసీఐ ఓకే

డీఆర్‌ఎస్‌కు బీసీసీఐ ఓకే

సుదీర్ఘ కాలంగా అంపైర్ నిర్ణయ సమీక్షా పద్దతి (డీఆర్‌ఎస్)ని వ్యతిరేకిస్తున్న బీసీసీఐ ఎట్టకేలకు తమ వైఖరిని మార్చుకుంది.

ఇంగ్లండ్‌తో సిరీస్‌లో అమలు 


న్యూఢిల్లీ: సుదీర్ఘ కాలంగా అంపైర్ నిర్ణయ సమీక్షా పద్దతి (డీఆర్‌ఎస్)ని వ్యతిరేకిస్తున్న బీసీసీఐ ఎట్టకేలకు తమ వైఖరిని మార్చుకుంది. ఈ పద్ధతిపై సానుకూలత వ్యక్తం చేస్తూ ఇంగ్లండ్‌తో జరగబోయే టెస్టు సిరీస్‌లో ప్రయోగాత్మకంగా అమలు చేయాలని నిర్ణరుుంచింది. గతంతో పోలిస్తే డీఆర్‌ఎస్‌లో పలు మార్పులు చోటు చేసుకోవడంతో బీసీసీఐలో అంతర్గతంగా చర్చ జరిగింది. తాజాగా డీఆర్‌ఎస్‌ను మరింత మెరుగ్గా తీర్చిదిద్దిన విధానాన్ని అంతర్జాతీయ క్రికెట్‌మండలి (ఐసీసీ) భారత క్రికెట్ బోర్డుకు వీడియో ప్రదర్శన ద్వారా చూపింది. ‘బీసీసీఐ సూచించినట్టుగానే హాక్ ఐ పద్ధతిలో పలు మార్పులను చేశారు. అందుకే అప్‌డేట్ చేసిన ఈ డీఆర్‌ఎస్‌ను అమలు చేయాలని నిర్ణరుుంచుకున్నాం. నవంబర్ 9 నుంచి ఇంగ్లండ్‌తో జరిగే టెస్టు సిరీస్‌లో దీన్ని ప్రయోగాత్మకంగా పరీక్షిస్తాం. ఇందులో నెలకొన్న నూతన పద్ధతులు ఎంతవరకు సరిగ్గా ఉన్నాయో ఈ సమయంలో తెలుస్తుంది. ముఖ్యంగా డీఆర్‌ఎస్ అనేది ఎల్బీ నిర్ణయాల్లో చాలా కీలక పాత్ర పోషిస్తుంటుంది. అందుకే బంతి ఎంతవరకు బ్యాట్స్‌మన్ ప్యాడ్‌ను తాకిందనే విషయాన్ని నిశితంగా పరిశీలిస్తాం.

అలాగే బాల్ ట్రాకింగ్ సాంకేతికతలో అల్ట్రామోషన్ కెమెరాలను ఉపయోగిస్తున్నారు. కాబట్టి కచ్చితత్వ నిర్ణయాలు వచ్చే అవకాశాలుంటారుు’ అని బోర్డు అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ తెలిపారు. గతంలో డీఆర్‌ఎస్‌ను బోర్డుతో పాటు కెప్టెన్ ఎంఎస్ ధోని తీవ్రంగా వ్యతిరేకించారు. అరుుతే కోచ్‌గా కుంబ్లే, కెప్టెన్‌గా కోహ్లి రాకతో పరిస్థితుల్లో మార్పు కనిపించింది. వీరిద్దరు ఈ పద్ధతికి సానుకూలత వ్యక్తం చేశారు. ఐసీసీ క్రికెట్ కమిటీ చైర్మన్‌గా ఉన్న కుంబ్లే గతేడాది ఎంఐటీ లాబొరేటరీని సందర్శించి బాల్ ట్రాకింగ్ సాంకేతికతతో పాటు హాట్ స్పాట్‌ను ఆధునీకరించిన విధానాన్ని పరిశీలించారు. భారత్ చివరిసారిగా 2008లో శ్రీలంకతో జరిగిన టెస్టు సిరీస్‌లో డీఆర్‌ఎస్‌ను ఉపయోగించింది.

Advertisement
 
Advertisement
Advertisement