నవంబరు 17 నుంచి విశాఖలో టెస్టు | BCCI announces dates for England tour of India | Sakshi
Sakshi News home page

నవంబరు 17 నుంచి విశాఖలో టెస్టు

Jul 16 2016 12:25 AM | Updated on Sep 4 2017 4:56 AM

తొలిసారిగా విశాఖపట్నం టెస్టు మ్యాచ్‌కు ఆతిథ్యమివ్వబోతోంది. నవంబర్ 9 నుంచి ఇంగ్లండ్‌తో జరిగే సిరీస్‌లో రెండో టెస్టుకు విశాఖ వేదిక కానుంది.

ఇంగ్లండ్‌తో సిరీస్ షెడ్యూల్ విడుదల
న్యూఢిల్లీ: తొలిసారిగా విశాఖపట్నం టెస్టు మ్యాచ్‌కు ఆతిథ్యమివ్వబోతోంది. నవంబర్ 9 నుంచి ఇంగ్లండ్‌తో జరిగే సిరీస్‌లో రెండో టెస్టుకు విశాఖ వేదిక కానుంది. నవంబర్ 17 నుంచి 21 వరకు ఈ మ్యాచ్ జరుగుతుంది. అలాగే తొలి టెస్టు (నవంబర్ 9-13) జరిగే రాజ్‌కోట్‌కు కూడా ఇదే మొదటి మ్యాచ్. మిగతా మూడు టెస్టులు మొహాలీ (నవంబర్ 26-30), ముంబై (డిసెంబర్ 8-12), చెన్నై (డిసెంబర్ 16-20)లలో జరుగుతాయి. ఈ సిరీస్‌లో కూడా డేనైట్ టెస్టుల ప్రస్తావన లేదు.

ఈ పర్యటనలో ఇంగ్లండ్ ఐదు టెస్టులతో పాటు మూడు వన్డేలు, మూడు టి20 మ్యాచ్‌లలో భారత్‌తో తలపడుతుంది. వచ్చే జనవరి 15 నుంచి వన్డే సిరీస్, 26నుంచి టి20లు జరుగుతాయి.

Advertisement
 
Advertisement
Advertisement