breaking news
Series Schedule
-
హైదరాబాద్‌లో భారత్–ఆస్ట్రేలియా టి20
న్యూఢిల్లీ: సొంత గడ్డపై భారత జట్టు ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాలతో పరిమిత ఓవర్ల సిరీస్‌లలో తలపడనుంది. ఆస్ట్రేలియాతో ముందుగా 3 టి20 మ్యాచ్‌లు ఆడే టీమిండియా... ఆ తర్వాత సఫారీ టీమ్‌తో 3 టి20లు, 3 వన్డేలు ఆడుతుంది. దీనికి సంబంధించిన షెడ్యూల్‌ను బీసీసీఐ దాదాపుగా ఖరారు చేసింది. చాలా కాలం తర్వాత హైదరాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ స్టేడియంకు మరో మ్యాచ్ నిర్వహణ అవకాశం లభించింది. భారత్, ఆస్ట్రేలియా మధ్య మూడో టి20 సెప్టెంబర్ 25న ఉప్పల్‌లో జరుగుతుంది. 2019 డిసెంబర్ 6న ఇక్కడ చివరి మ్యాచ్ (భారత్–విండీస్ టి20) జరిగింది. సిరీస్‌లోని తొలి రెండు మ్యాచ్‌లు సెప్టెంబర్ 20, 23 తేదీల్లో మొహాలి, నాగ్‌పూర్‌లలో జరుగుతాయి. దక్షిణాఫ్రికాతో సెప్టెంబర్ 28, అక్టోబర్ 1, 3 న జరిగే 3 టి20లకు వేదికలుగా త్రివేండ్రం, గువహటి, ఇండోర్ ఖరారయ్యాయి. దక్షిణాఫ్రికాతోనే జరిగే 3 వన్డేలకు అక్టోబర్ 6, 9, 11 తేదీల్లో రాంచీ, లక్నో, న్యూఢిల్లీ ఆతిథ్యం ఇవ్వనున్నాయి. -
నవంబరు 17 నుంచి విశాఖలో టెస్టు
ఇంగ్లండ్‌తో సిరీస్ షెడ్యూల్ విడుదల న్యూఢిల్లీ: తొలిసారిగా విశాఖపట్నం టెస్టు మ్యాచ్‌కు ఆతిథ్యమివ్వబోతోంది. నవంబర్ 9 నుంచి ఇంగ్లండ్‌తో జరిగే సిరీస్‌లో రెండో టెస్టుకు విశాఖ వేదిక కానుంది. నవంబర్ 17 నుంచి 21 వరకు ఈ మ్యాచ్ జరుగుతుంది. అలాగే తొలి టెస్టు (నవంబర్ 9-13) జరిగే రాజ్‌కోట్‌కు కూడా ఇదే మొదటి మ్యాచ్. మిగతా మూడు టెస్టులు మొహాలీ (నవంబర్ 26-30), ముంబై (డిసెంబర్ 8-12), చెన్నై (డిసెంబర్ 16-20)లలో జరుగుతాయి. ఈ సిరీస్‌లో కూడా డేనైట్ టెస్టుల ప్రస్తావన లేదు. ఈ పర్యటనలో ఇంగ్లండ్ ఐదు టెస్టులతో పాటు మూడు వన్డేలు, మూడు టి20 మ్యాచ్‌లలో భారత్‌తో తలపడుతుంది. వచ్చే జనవరి 15 నుంచి వన్డే సిరీస్, 26నుంచి టి20లు జరుగుతాయి.