తొలి టెస్ట్ సిరీస్: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా | Australia won the toss and elected to bat | Sakshi
Sakshi News home page

తొలి టెస్ట్ సిరీస్: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా

Dec 9 2014 5:14 AM | Updated on Sep 2 2017 5:50 PM

భారత్, ఆస్ట్రేలియా జట్టుల మధ్య మంగళవారమిక్కడ జరుగుతున్న తొలి టెస్ట్ సిరీస్లో ఆస్ట్రేలియా తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.

అడిలైడ్:  భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో భాగంగా మంగళవారమిక్కడ జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్లో  తొలుత టాస్ గెలిచి ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఎంచుకుంది. కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అన్ ఫిట్ అని తేలడంతో..  భారత స్టార్ బ్యాట్స్ మన్ విరాట్ కోహ్లీకి పగ్గాలు అప్పగించారు.

గాయం నుంచి కోలుకున్నా మరింత విశ్రాంతి కావాలని ధోని భావించడంతో అడిలైడ్ మ్యాచ్‌కు దూరమయ్యాడు. దీంతో కోహ్లికి మార్గం సుగమమైంది. టెస్టుల్లో తొలిసారి ఈ స్టార్ క్రికెటర్ భారత్‌కు సారథ్యం వహిస్తున్నాడు. మరోవైపు ఆస్ట్రేలియా కెప్టెన్ మైకేల్ క్లార్క్ కోలుకుని తొలి టెస్టులో ఆడుతున్నాడు. ఆస్ర్టేలియా ఓపెనర్లు రోజర్స్, వార్నర్ శుభారంభం చేశారు.
 

 

Advertisement
 
Advertisement
Advertisement