సెప్టెంబర్‌లో ఇంగ్లండ్‌లో ఆసీస్ పర్యటన!

మెల్‌బోర్న్: పరిమిత ఓవర్ల క్రికెట్ సిరీస్ కోసం ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఆస్ట్రేలియా జట్టు ఇంగ్లండ్‌లో పర్యటించే అవకాశం ఉంది. రెండు వారాల్లోపే ముగిసే ఈ పర్యటనలో ఇంగ్లండ్‌తో ఆసీస్ జట్టు మూడు టి20లు, మూడు వన్డేలను ఆడనుంది. సెప్టెంబర్ 4, 6, 8 తేదీల్లో టి20 మ్యాచ్‌లను... అనంతరం సెప్టెంబర్ 10, 12, 15 తేదీల్లో వన్డే మ్యాచ్‌లు నిర్వహించాలనుకుంటున్నారు. ఈ మ్యాచ్‌లన్నీ సౌతాంప్టన్, మాంచెస్టర్‌లలోనే జరిగే అవకాశం ఉంది.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి