ఆసియా స్నూకర్‌ రన్నరప్‌ భారత్‌  | Asia Snooker runner up India | Sakshi
Sakshi News home page

ఆసియా స్నూకర్‌ రన్నరప్‌ భారత్‌ 

Sep 22 2018 1:14 AM | Updated on Sep 22 2018 1:14 AM

Asia Snooker runner up India - Sakshi

దోహా: ఆసియా టీమ్‌ స్నూకర్‌ చాంపియన్‌షిప్‌లో పంకజ్‌ అద్వానీ, మల్కీత్‌ సింగ్‌లతో కూడిన భారత్‌–1 జట్టు రన్నరప్‌గా నిలిచింది. శుక్రవారం జరిగిన ఫైనల్లో భారత్‌–1 జట్టు 2–3 (2–110, 81–47, 70–72, 107–5, 18–98) ఫ్రేమ్‌ల తేడాతో మొహమ్మద్‌ ఆసిఫ్, బాబర్‌ మసీలతో కూడిన పాకిస్తాన్‌–1 జట్టు చేతిలో ఓడిపోయింది.

సెమీఫైనల్స్‌లో భారత్‌–1 జట్టు 3–2 ఫ్రేమ్‌ల తేడాతో మొహమ్మద్‌ మాజిద్‌ అలీ, మొహమ్మద్‌ బిలాల్‌లతో కూడిన పాకిస్తాన్‌–2 జట్టుపై... పాకిస్తాన్‌–1 జట్టు 3–1 ఫ్రేమ్‌ల తేడాతో వు యిజి, పాంగ్‌జున్‌జులతో కూడిన చైనా జట్టుపై విజయం సాధించాయి.    

Advertisement
 
Advertisement
Advertisement