పీవోకేలో కుప్పకూలిన హెలికాప్టర్‌.. 21 మంది మృతి | Soldiers killed in helicopter crash in PoK | Sakshi
Sakshi News home page

పీవోకేలో కుప్పకూలిన హెలికాప్టర్‌.. 21 మంది మృతి

Jun 10 2026 4:51 PM | Updated on Jun 10 2026 5:49 PM

Soldiers killed in helicopter crash in PoK

పీవోకేలో  ఘోర విషాదం జరిగింది. పాకిస్తాన్ ఆర్మీకి చెందిన Mi-17 హెలికాప్టర్ ముజఫరాబాద్ సమీపంలో కుప్పకూలింది.దీంతో అందులో ప్రయాణిస్తున్న 21 మంది సైనికులు మృతిచెందారు. హెలికాప్టర్ టేకాఫ్ అయిన కొద్దిసేపటికే సాంకేతిక లోపం తలెత్తడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు పాకిస్తాన్ ఆర్మీ ప్రకటించింది. 

ప్రస్తుతం పీవోకోలో తీవ్ర నిరసనలు తలెత్తిన నేపథ్యంలో నీలమ్ వ్యాలీ సెక్టార్‌కు అదనపు బలగాలను తరలిస్తుండగా టేకాఫ్ సమయంలో సాంకేతిక లోపం తలెత్తింది. అయితే ఫైలట్ చాకచక్యంగా వ్యవహరించి అత్యవసర ల్యాండింగ్‌కు ప్రయత్నించినప్పటికీ అది విఫలమై కూలిపోయిందని పాక్ మీడియా తెలిపింది.

పీఓకే ప్రాంతాల్లో నిరసనలు, ఉద్రిక్తతలు కొనసాగుతున్న సమయంలో ఈ భారీ ప్రమాదం సంభవించడంతో హెలికాప్టర్‌పై దాడులు జరిగాయా అనే అనుమానం తలెత్తింది. బలూచ్ ఆర్మీ దాడులు చేసిందని వార్తలు రావడంతో  తీవ్ర ఆందోళనలు రేకేత్తాయి. ఈ నేపథ్యంలో సాంకేతిక లోపంతోనే ప్రమాదం జరిగిందని ఆర్మీ నిర్ధారించింది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement