జూన్‌ 2021కి...  | Asia Cup Postponed Due To Coronavirus | Sakshi
Sakshi News home page

జూన్‌ 2021కి... 

Jul 10 2020 2:14 AM | Updated on Jul 10 2020 2:14 AM

Asia Cup Postponed Due To Coronavirus - Sakshi

న్యూఢిల్లీ: కరోనా కారణంగా క్రికెట్‌లో మరో ప్రధాన టోర్నీని వాయిదా వేయక తప్పలేదు. ఈ ఏడాది సెప్టెంబరులో జరగాల్సిన ఆసియా కప్‌ను వచ్చే ఏడాది 2021కు వాయిదా వేస్తున్నట్లు ఆసియా క్రికెట్‌ కౌన్సిల్‌ (ఏసీసీ) ప్రకటించింది. ఆసియా ఖండంలో కోవిడ్‌–19 తీవ్రత పెరిగిపోతుండటంతో ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదని స్పష్టం చేసింది. ‘అన్ని రకాల పరిస్థితులను అంచనా వేసిన తర్వాత సెప్టెంబర్‌లో జరగాల్సిన ఆసియా కప్‌ను వాయిదా వేయడమే మంచిదని ఏసీసీ ఎగ్జిక్యూటివ్‌ బోర్డు భావించింది. షెడ్యూల్‌ ప్రకారమే దీనిని నిర్వహించాలని మేం ముందుగా అనుకున్నా...ప్రయాణాలపై ఆంక్షలు, ఒక్కో దేశంలో ఒక్కో రకమైన క్వారంటైన్‌ నిబంధనలు, సోషల్‌ డిస్టెన్సింగ్‌ తదితర అంశాలను బట్టి చూస్తే ఎన్నో సవాళ్లు ఉంటాయి. అన్నింటికి మించి ఆటగాళ్ల ఆరోగ్యం కూడా ముఖ్యం కాబట్టి వాయిదా తప్పలేదు’ అని ఏసీసీ ట్వీట్‌ చేసింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement