అశ్విన్ మరో ఘనత | Ashwin eclipses Srinath | Sakshi
Sakshi News home page

అశ్విన్ మరో ఘనత

Dec 8 2016 4:17 PM | Updated on Sep 4 2017 10:14 PM

అశ్విన్ మరో ఘనత

అశ్విన్ మరో ఘనత

టీమిండియా ప్రధాన స్పిన్నర్ రవి చంద్రన్ అశ్విన్ మరో ఘనతను సొంతం చేసుకున్నాడు.

ముంబై: టీమిండియా ప్రధాన స్పిన్నర్ రవి చంద్రన్ అశ్విన్ మరో ఘనతను సొంతం చేసుకున్నాడు. ఐదు టెస్టుల సిరీస్లోభాగంగా ఇంగ్లండ్తో ఇక్కడ జరుగుతున్న నాల్గో టెస్టు తొలి ఇన్నింగ్స్లో మొయిన్ అలీ వికెట్ను సాధించడం ద్వారా భారత తరపున అత్యధిక టెస్టు వికెట్లు సాధించిన ఏడో బౌలర్గా అశ్విన్ గుర్తింపు సాధించాడు. ఈ క్రమంలోనే భారత మాజీ పేసర్ జవగళ్ శ్రీనాథ్ (236 వికెట్లు) టెస్టు వికెట్లను అశ్విన్ అధిగమించాడు. ఈ టెస్టుకు ముందు అశ్విన్ ఖాతాలో 235 వికెట్లు ఉండగా.. ఈ మ్యాచ్లో రూట్, అలీ వికెట్లను తీయడం ద్వారా శ్రీనాథ్ రికార్డును అశ్విన్ సవరించాడు.

కాగా,ఆ తరువాత జెన్నింగ్స్, బెయిర్ స్టోలను కూడా పెవిలియన్ కు పంపి సత్తా చాటాడు. ఇటీవల ఫాస్టెస్ 200 వికెట్లను అత్యంత వేగంగా సాధించిన రెండో బౌలర్గా అశ్విన్ నిలిచిన సంగతి తెలిసిందే. గత కొంతకాలంగా ఆల్ రౌండర్ కోటాను సమర్ధవంతంగా పోషిస్తున్న అటు బంతితోనూ, ఇటు బ్యాట్తోనూ మెరుస్తూ టీమిండియాలో కీలక పాత్ర పోషిస్తున్నాడు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement