భారత్‌కు మరో రెండు స్వర్ణాలు | Another two gold to India | Sakshi
Sakshi News home page

భారత్‌కు మరో రెండు స్వర్ణాలు

Nov 10 2016 11:13 PM | Updated on Sep 4 2017 7:44 PM

ప్రపంచ క్యారమ్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు మరో రెండు పసిడి పతకాలు లభించారుు.

ప్రపంచ క్యారమ్ చాంపియన్‌షిప్ 

హైదరాబాద్:  ప్రపంచ క్యారమ్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు మరో రెండు పసిడి పతకాలు లభించారుు. టీమ్ విభాగంలో మహిళల జట్టు, డబుల్స్ విభాగంలో పురుషుల జట్టు విజేతలుగా నిలిచారుు. బర్మింగ్‌హమ్‌లో గురువారం జరిగిన మహిళల టీమ్ ఈవెంట్ ఫైనల్లో అపూర్వ, కాజోల్ కుమారి, పరిమళా దేవి, టుబాసేహర్‌లతో కూడిన భారత జట్టు 3-0తో శ్రీలంక జట్టును ఓడించి టైటిల్‌ను గెలుచుకోగా..పురుషుల జట్టు 1-2 తో శ్రీలంక చేతిలో ఓడిపోరుుంది.

మరోవైపు డబుల్స్ విభాగంలో భారత పురుషుల జట్టు స్వర్ణం, రజతంతో రాణించింది. ఫైనల్లో సందీప్- రియాజ్ (భారత్) జంట 13-25, 23-13, 25-12తో భారత్‌కే చెందిన శంకర- ప్రశాంత్ జోడీపై నెగ్గి విజేతగా నిలిచింది. ఈ టోర్నీలో మహిళల డబుల్స్ విభాగంలోనూ భారత్‌కు స్వర్ణం లభించింది.

Advertisement
 
Advertisement
Advertisement