breaking news
World Carrom Championship
-
భారత్‌కు మరో రెండు స్వర్ణాలు
ప్రపంచ క్యారమ్ చాంపియన్‌షిప్ హైదరాబాద్: ప్రపంచ క్యారమ్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు మరో రెండు పసిడి పతకాలు లభించారుు. టీమ్ విభాగంలో మహిళల జట్టు, డబుల్స్ విభాగంలో పురుషుల జట్టు విజేతలుగా నిలిచారుు. బర్మింగ్హమ్లో గురువారం జరిగిన మహిళల టీమ్ ఈవెంట్ ఫైనల్లో అపూర్వ, కాజోల్ కుమారి, పరిమళా దేవి, టుబాసేహర్లతో కూడిన భారత జట్టు 3-0తో శ్రీలంక జట్టును ఓడించి టైటిల్‌ను గెలుచుకోగా..పురుషుల జట్టు 1-2 తో శ్రీలంక చేతిలో ఓడిపోరుుంది. మరోవైపు డబుల్స్ విభాగంలో భారత పురుషుల జట్టు స్వర్ణం, రజతంతో రాణించింది. ఫైనల్లో సందీప్- రియాజ్ (భారత్) జంట 13-25, 23-13, 25-12తో భారత్‌కే చెందిన శంకర- ప్రశాంత్ జోడీపై నెగ్గి విజేతగా నిలిచింది. ఈ టోర్నీలో మహిళల డబుల్స్ విభాగంలోనూ భారత్‌కు స్వర్ణం లభించింది. -
క్యారమ్‌లో భారత్‌కు స్వర్ణం
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ క్యారమ్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు పసిడి పతకం లభించింది. బర్మింగ్హమ్ (గ్రేట్ బ్రిటన్)లో జరుగుతోన్న ఈ పోటీల్లో హైదరాబాద్ క్రీడాకారిణి ఎస్. అపూర్వ (ఎల్ఐసీ) భారత్‌కు డబుల్స్ విభాగంలో స్వర్ణ పతకాన్ని అందించింది. మహిళల డబుల్స్ ఫైనల్లో అపూర్వ - కాజల్ కుమారి (భారత్) జంట 25-14, 25-16తో భారత్‌కే చెందిన పరిమళా దేవి- టుబా స్నేహర్ జోడీపై గెలుపొంది విజేతగా నిలిచింది. అంతకుముందు జరిగిన సెమీఫైనల్లో అపూర్వ- కాజల్ జంట 25-1, 25-7తో యశిక- అరోషా (శ్రీలంక) జోడీపై విజయం సాధించింది. కాగా 2004 కొలంబోలో జరిగిన వరల్డ్ చాంపియన్‌షిప్‌లో అపూర్వ విజేతగా నిలిచింది.