రిషబ్‌పంత్‌కు మళ్లీ నిరాశే.. | Again disappointed for Rishabh pant | Sakshi
Sakshi News home page

రిషబ్‌పంత్‌కు మళ్లీ నిరాశే..!

Jul 6 2017 7:31 PM | Updated on Sep 5 2017 3:22 PM

రిషబ్‌పంత్‌కు మళ్లీ నిరాశే..

రిషబ్‌పంత్‌కు మళ్లీ నిరాశే..

విండీస్‌ పర్యటనకు ఎంపికైన రిషబ్‌పంత్‌కు అంతర్జాతీయ వన్డెలో ఆరంగ్రేటం చేయడం అందని ద్రాక్షగా మిగిలిపోయింది.

♦ టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న విండీస్‌

కింగ్ స్టన్‌: విండీస్ పర్యటన ఎంపికతో అంతర్జాతీయ వన్డేల్లో ఆరంగ్రేటం చేయాలనుకున్న పంత్‌ ఆశలన్నీ అడియాశలయ్యాయి. భారత్‌ ఆడిన గత నాలుగు మ్యాచ్‌ల్లో పంత్‌ రిజర్వ్‌ బెంచ్‌కే పరిమితమయ్యాడు. ఇక చివరి వన్డేలోనైన అవకాశం కల్పిస్తారని భావించినా నిరాశే ఎదురైంది. నేడు (గురువారం) జరుగుతున్న ఫైనల్ మ్యాచ్‌లో భారత్‌ ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతొంది. ఇక ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన విండీస్‌ బ్యాటింగ్‌ ఎంచుకుంది. విండీస్‌ కూడా ఎలాంటి మార్పులు చేయలేదు. ఇక గత మ్యాచ్‌కు దూరమైన అశ్విన్‌, యువరాజ్‌లను కూడా ఫైనల్‌ మ్యాచ్‌కు తీసుకోలేదు.

తుది జట్లు
భారత్‌: రహానే, ధావన్‌, విరాట్‌ కోహ్లీ (కెప్టెన్‌), దినేష్‌ కార్తీక్‌, ధోని, జాదవ్‌, పాండ్యా, జడేజా, కుల్దీప్‌ యాదవ్‌, ఉమేశ్‌ యాదవ్‌, మహ్మద్‌ షమీ

వెస్టిండీస్‌: లూయిస్‌, హోప్‌, కేఏ హోప్‌, చేస్‌, మహమ్మద్‌, హోల్డర్‌ (కెప్టెన్‌), పోవెల్‌, నర్స్‌, బిషూ, జోసఫ్, విలియమ్స్‌

Advertisement
 
Advertisement
Advertisement