రహస్య వివాహం చేసుకున్న నిక్కీ మినాజ్‌

Rapper Nicki Minaj Secretly Marries Kenneth Petty - Sakshi

బ్యాడ్‌బాయ్‌తో నిక్కీ మినాజ్‌ వివాహం

ప్రముఖ ర్యాపర్‌ నిక్కీ మినాజ్‌(36) ఎట్టకేలకు తన ప్రియుడు, బ్యాడ్‌బాయ్‌ కెన్నెత్‌ పెర్రీని రహస్య వివాహం చేసుకొని ఒక్కటయ్యారు. ఈ మేరకు ఆమె తన ట్విటర్‌ ఖాతాలో ఉన్న పేరును 'మిసెస్‌ పెట్టీ'గా మార్చారు. అంతేకాక సోమవారం ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసిన వీడియోలో..  'ఒనికా తాన్య మరాజ్-పెట్టీ 10.21.19' అనే క్యాప్షన్‌ను ఇచ్చారు. ఒనికా తాన్య మరాజ్ అనేది నిక్కీ మినాజ్‌ అసలు పేరు. పెట్టీ అనేది తన ప్రియుడి పేరు. ఇద్దరూ అధికారికంగా వివాహ బంధంతో ఒక్కటయ్యారు అనేలా తేదిని జత చేశారు. ఇప్పటికే పెళ్లితంతు ముగిసిందనే అర్థం వచ్చేలా.. తన పేరుతో పాటు ప్రియుడి పేరు, తేదీను జత చేశారు. ఇక వీడియోలో మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ ఉన్న మగ్‌లతో పాటు వధూవరులనే అర్థానిచ్చే రెండు బేస్‌బాల్‌ క్యాప్‌లు ఉన్నాయి. దీంతో ఒక్కసారిగా షాక్‌కు గురైన ఆమె ఫ్యాన్స్‌.. ఆ వెంటనే తేరుకొని నిక్కీ మినాజ్‌కు శుభాకాంక్షలు చెబుతున్నారు.  

అయితే మ్యారేజ్‌ లైసెన్స్‌ గడువు ముగియనుండడంతో.. ప్రియుడిని ఉన్నపళంగా వివాహం చేసుకొందని.. మళ్లీ రెండోసారి గ్రాండ్‌గా వివాహం చేసుకోనుందనే పుకార్లు సోషల్‌మీడియాలో గుప్పుమంటున్నాయి. నిక్కీ తాను పెళ్లి చేసుకుంటున్నాను అనే వార్తను.. జూన్‌ 21న ఒక రేడియోలో అధికారింగా ప్రకటించారు. అందులో ఆమె.. తన బాయ్‌ఫ్రెండ్‌ మ్యారెజ్‌ లైసెన్స్‌ పొందడంతో 90 రోజుల్లోపే పెళ్లి చేసుకోనున్నాని స్పష్టం చేశారు. గతేడాది నుంచి పెట్టీతో డేట్‌ చేస్తున్న నిక్కీ.. పెట్టీతో ప్రేమలో ఉన్నట్టు తొలిసారిగా గత డిసెంబర్‌లో ఇన్‌స్టాగ్రామ్‌లో ధృవీకరించారు. లైంగిక ఆరోపణలతో దోషిగా తేలిన కెన్నెత్‌ పెట్టీను.. నిక్కీ ఏరికోరి వివాహం చేసుకోవడం గమనార్హం.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top