లోకేష్‌ ట్వీట్‌.. నెటిజన్ల సెటైర్స్‌! | Netizens Setyres On Nara Lokesh Tweet | Sakshi
Sakshi News home page

Sep 28 2018 2:26 PM | Updated on Oct 22 2018 6:13 PM

Netizens Setyres On Nara Lokesh Tweet - Sakshi

 దృశ్యం కమనీయమే కానీ మీ పోలికే దరిద్రంగా ఉందంటూ..

సాక్షి, హైదరాబాద్‌: మంత్రి నారా లోకేష్‌ చేసిన ట్వీట్‌పై నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. తాజాగా లోకేష్‌.. దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ ఫొటోకు క్యాప్షన్‌గా.. ‘నవ్యాంధ్రలో మళ్లీ చంద్రోదయమే అంటున్న అన్నగారు.. ఆంధ్రప్రదేశ్‌ తెలుగుదేశం పార్టీ ఆఫీసులో అవిష్కృతమైనది ఈ కమనీయ దృశ్యం’ అని పేర్కొంటూ ట్వీట్‌ చేశారు. అయితే దృశ్యం కమనీయమే కానీ మీ పోలికే బాలేదంటూ కామెంట్‌ చేస్తున్నారు నెటిజన్లు.

‘ఆ చంద్రుడే నాకు వెన్నుపోటు పొడిచాడు అని కూడా అన్నగారు చెప్పారని’ ఒకరు.. ‘90 శాతం చంద్రన్న పనైపోయింది. ఇంకా 10 శాతం మాత్రమే మిగిలి ఉంది. తెలుగు ప్రజలకు మంచిరోజులు రాబోతున్నాయి’ అని మరొకరు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. ‘చూడండి బ్రదర్‌.. చంద్రాస్తమయం అని చూపిస్తున్నట్లుగా ఉంద’ని ఇంకొకరు కామెంట్‌ చేశారు. 

Advertisement
 
Advertisement
Advertisement