ఏపీలో వైఎస్సార్‌సీపీ హవా

YSRCP Will Get 120 To 130 Seats Says CPS Survey - Sakshi

సీపీఎస్‌ సర్వే వెల్లడి

121 నుంచి 130 ఎమ్మెల్యే స్థానాల్లో విజయం.. 21 ఎంపీ సీట్లు కైవసం

45 నుంచి 54 ఎమ్మెల్యే, 4 ఎంపీ సీట్లకే టీడీపీ పరిమితం

ఒకట్రెండు ఎమ్మెల్యే స్థానాల్లోనే జనసేన గెలుపు

ప్రముఖ ఎన్నికల విశ్లేషకుడు వేణుగోపాలరావు వెల్లడి

సాక్షి, అమరావతి: ఏపీలో జరగనున్న ఎన్నికల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభంజనం సృష్టించనుందని సెంటర్‌ ఫర్‌ సెఫాలజీ స్టడీస్‌(సీపీఎస్‌) సర్వే స్పష్టం చేసింది. ఆ పార్టీ ఏకంగా 121 నుంచి 130 ఎమ్మెల్యే సీట్లలో విజయభేరి మోగించి అధికారంలోకి రానుందని తేల్చిచెప్పింది. వైఎస్సార్‌సీపీ 21 ఎంపీ స్థానాల్లోనూ విజయం సాధించనుందని పేర్కొంది. కాగా, అధికార తెలుగుదేశం పార్టీ కేవలం 45 నుంచి 54 ఎమ్మెల్యే సీట్లు, 4 ఎంపీ సీట్లకే పరిమితం కానుందని వెల్లడించింది. జనసేన పార్టీకి కేవలం ఒకట్రెండు ఎమ్మెల్యే సీట్లు దక్కే అవకాశం ఉందని ఆ సర్వే తేల్చిచెప్పింది. ప్రముఖ ఎన్నికల విశ్లేషకుడు డా.వేణుగోపాలరావు నేతృత్వంలో సీపీఎస్‌ సంస్థ ఎన్నికల సర్వేల నిర్వహణలో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. 2009 నుంచి ఆ సంస్థ నిర్వహిస్తున్న సర్వేలన్నీ నిజమవుతూ వస్తున్నాయి. ఇటీవల తెలంగాణ ఎన్నికల సందర్భంగా సీపీఎస్‌ సర్వే ఫలితాలు పూర్తిగా నిజమయ్యాయి.

తీవ్ర ఆసక్తి కలిగిస్తున్న ఏపీ ఎన్నికల్లో ప్రజాభిప్రాయం ఎలా ఉండనుందనే అంశంపై సీపీఎస్‌ సంస్థ రెండు దశల్లో సర్వే నిర్వహించింది. ఈ ఏడాది ఫిబ్రవరి 17 నుంచి 21 వరకు మొదటి దశ సర్వేలో 4,37,642 మంది అభిప్రాయాలను సేకరించింది. మార్చి 27 నుంచి 31వ తేదీ మధ్య రెండో దశ సర్వేలో 3,04,323 మంది అభిప్రాయా లను సేకరించింది. అంటే మొత్తం 7,41,965 శాంపి ల్స్‌ సేకరించి శాస్త్రీయంగా సర్వే నిర్వహించింది. అనంతరమే సర్వే ఫలితాలను ప్రకటించింది. ఈ సందర్భంగా ప్రముఖ పాత్రికేయుడు సుధీర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏపీ ప్రజల అభిప్రాయాలు, ఇక్కడ ఎన్నికల ఫలితాలపై తమ సర్వే వివరాలను వేణుగోపాలరావు వెల్లడించారు.

సుధీర్‌: ఏపీలో ఎన్నికల ఫలితాలపై మీ సర్వే ఏం చెబుతోంది?
వేణుగోపాలరావు: ఏపీలో వైఎస్సార్‌సీపీ ప్రభం జనం సృష్టించనుంది. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్రంలో భారీ మెజార్టీ తో విజయం సాధిస్తుంది. మేము ఫిబ్రవరిలో నిర్వహించిన సర్వేలో టీడీపీ కంటే వైఎస్సార్‌సీపీకి 4% ఓట్లు అధికంగా వచ్చాయి. తాజాగా నిర్వహిం చిన సర్వేలో టీడీపీ కంటే వైఎస్సార్‌సీపీ 8% అధికంగా ఓట్లు సాధించనుందని స్పష్టమైంది. 2014లో వైఎస్సార్‌సీపీ కేవలం 1.60 శాతం ఓట్లతో వెనుకబడి అధికారానికి దూరమైంది. ఇప్పుడు ఏకంగా 8 శాతం ఓట్లు అధికంగా సాధించనుందంటే ఆ పార్టీకి ఎంత భారీ మెజార్టీ రానుందో ఊహించుకోవచ్చు.

సుధీర్‌: మీ సర్వే ప్రకారం ఏపీలో ప్రధాన పార్టీలు ఎంత ఓట్ల శాతం సాధించనున్నాయి?
వేణుగోపాలరావు: వైఎస్సార్‌సీపికి 48.1 శాతం ఓట్లు రానున్నాయి. టీడీపీకి 40.1 శాతం ఓట్లు వస్తాయి. జనసేన 8 శాతం ఓట్లు దక్కించుకుంటుంది. కాంగ్రెస్, బీజేపీలు పెద్దగా ప్రభావం చూపించే పరిస్థితి లేదు.

సుధీర్‌: గత రెండు వారాల్లో వైఎస్సార్‌సీపీకి ఓట్ల శాతం భారీగా పెరగడానికి కారణమేమిటి?
వేణుగోపాలరావు: జగన్‌ విస్తృతంగా, ప్రణాళికాబద్ధంగా చేస్తున్న ఎన్నికల ప్రచారమే ప్రధాన కారణం. అదేసమయంలో ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు పూర్తిగా తేలిపోతున్నారు. ఆయన చేతులెత్తేశారు. అసలు చంద్రబాబు ఎన్నికల ప్రచార వ్యూహమే తప్పు. చంద్రబాబు ప్రభుత్వం పట్ల, టీడీపీ ఎమ్మెల్యేల పట్ల ప్రజావ్యతిరేకత తీవ్రంగా ఉందని అందరికీ తెలుసు. కానీ, ఆయన ఆ విషయాన్ని వదిలేసి సెంటిమెంట్‌ను రెచ్చగొట్టాలని ప్రయత్నిస్తున్నారు. జగన్, నరేంద్ర మోదీ ఒక్కటేనని చెప్పి, ఏపీ సమస్యలకు వారిద్దరే కారణమనే ప్రచార వ్యూహాన్ని అనుసరించడమే పెద్ద తప్పు. ఇక చివరి ప్రయత్నంగానే చంద్రబాబు మూడు నెలల్లో కొన్ని సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టినా అవి పెద్దగా ప్రభావం చూపించడం లేదు. ప్రత్యేక హోదా అంశంలో ఆయన యూటర్న్‌ తీసుకోవడం కూడా పెద్దగా ఉపయోగపడలేదు. ఆయన యూటర్న్‌ బాబుగా మరింత అపఖ్యాతిపాలయ్యారు.

సుధీర్‌: ప్రత్యేక హోదాను ఈ ఎన్నికల్లో కీలక అంశంగా ఎవరూ పరిగణించడం లేదనిపిస్తోంది కదా?
వేణుగోపాలరావు: అది కొంతవరకు నిజమే. కానీ ప్రత్యేక హోదా విషయంలో  వైఎస్‌ జగన్, చంద్రబాబుల  వైఖరిని ప్రజలు పోల్చిచూస్తున్నారు. ఆ విషయంలో జగన్‌ పట్లే విశ్వసనీయత వ్యక్తమవుతోంది. ఆయనకు 90 శాతం ప్రజామోదం లభిస్తుండగా, చంద్రబాబు పట్ల కేవలం 10 శాతమే ఉంది.

సుధీర్‌: జగన్‌కు ఓటేస్తే కేసీఆర్‌కు వేసినట్లేనని చంద్రబాబు ఆరోపిస్తున్నారు. అది ప్రజలపై ప్రభావం చూపించడం లేదా?
వేణుగోపాలరావు: చంద్రబాబు చేస్తున్న ఆ ప్రచారం క్షేత్రస్థాయిలో పెద్దగా ప్రభావం చూపించడం లేదు. ఎందుకంటే టీఆర్‌ఎస్‌ ఏపీలో పోటీ చేయడం లేదు. ఏపీలో ఏ పార్టీతోనూ పొత్తుపెట్టుకోలేదు. తెలంగాణ ఎన్నికల పరిస్థితి ఏపీలో లేదు. అక్కడ టీడీపీ కాంగ్రెస్‌తో కలిసి ఎన్నికల్లో పోటీ చేసింది. అక్కడ టీడీపీ–కాంగ్రెస్‌ తరపున చంద్రబాబు ప్రచారం చేశారు. అందుకే కాంగ్రెస్‌కు ఓటేస్తే అమరావతికి ఓటేసినట్లేనన్న కేసీఆర్‌ ప్రచారం ప్రజల్లోకి బాగా వెళ్లింది. ఆ పరిస్థితి ఏపీలో లేనేలేదు. ఏపీ ప్రజలు జగన్‌కు ఓ అవకాశం ఇవ్వాలని భావిస్తున్నట్లు మా సర్వేలో వెల్లడైంది. జగన్‌ ప్రకటించిన పథకాల పట్ల ప్రజల్లో సానుకూల స్పందన వ్యక్తమవుతోంది.

సుధీర్‌: జగన్‌ అవినీతిపరుడని టీడీపీ పెద్దగా ప్రచారం చేస్తోంది కదా?
వేణుగోపాలరావు: అది ప్రస్తుతం ఎన్నికల్లో ప్రధానాంశంగా లేదని మా సర్వేలో వెల్లడైంది. ఎందుకంటే చంద్రబాబు ప్రభుత్వం కూడా ఐదేళ్లలో భారీగా అవినీతికి పాల్పడిందని ప్రజలు గుర్తించారు. అదేవిధంగా జగన్‌ వస్తే రౌడీయిజం వస్తుందంటూ చంద్రబాబు చేస్తున్న ఆరోపణలను కూడా ప్రజలు పట్టించుకోవడం లేదు. అవే ఆరోపణలు 2014లో టీడీపీకి  కొంత లాభించాయి. మళ్లీ అలాంటి ఆరోపణలనే చంద్రబాబు ఎన్నిసార్లు, ఎన్ని ఎన్నికల్లో చేస్తూ ఉంటారని ప్రజలే తిరిగి ప్రశ్నిస్తున్నారు.

సుధీర్‌: జనసేన ప్రభావం ఎలా ఉండనుంది?
వేణుగోపాలరావు: పవన్‌ కల్యాణ్‌ 8 శాతం ఓట్లు సాధించే అవకాశం ఉంది. ఆ ఓట్లు కూడా  ప్రధానంగా తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, విశాఖ జిల్లాల నుంచే వచ్చే వీలుంది. ఆ పార్టీ ప్రభావం ఆ మూడు జిల్లాలకే పరిమితం. జనసేన ఒకట్రెండు ఎమ్మెల్యే సీట్లు గెల్చుకునే అవకాశం మాత్రమే ఉందని మా అంచనా.

సుధీర్‌: ఏపీలో ఏ పార్టీ ఎన్నిసీట్లు గెల్చుకోవచ్చని మీ సర్వేలో తేలింది?
వేణుగోపాలరావు: వైఎస్సార్‌సీపీ 121 నుంచి 130 సీట్లలో విజయం సాధించి అధికారంలోకి వస్తుంది. టీడీపీ 45 నుంచి 54 సీట్లకు పరిమితమవుతుంది. జనసేన ఒకట్రెండు సీట్లు మాత్రమే దక్కించుకుంటుంది. వైఎస్సార్‌సీపీ 21 లోక్‌సభ స్థానాల్లో విజయం సాధిస్తుంది. టీడీపీ 4 ఎంపీ సీట్లు గెల్చుకుంటుంది. జనసేనకు ఎంపీ సీట్లు వచ్చే అవకాశం లేదు.  

సుధీర్‌: డ్వాక్రా సంఘాల సభ్యుల మొగ్గు ఎటువైపు ఎంతగా ఉంది?
వేణుగోపాలరావు: డ్వాక్రా సంఘాల మహిళల్లో 45.2 శాతం మంది వైఎస్సార్‌సీపీ పట్ల సానుకూలంగా ఉన్నారు. టీడీపీ పట్ల 44 శాతం మంది అనుకూలంగా ఉన్నారు.

సుధీర్‌: నాయకత్వ లక్షణాల పరంగా జగన్, చంద్రబాబు పట్ల ప్రజాభిప్రాయం ఎలా ఉంది?
వేణుగోపాలరావు: ఈ ఎన్నికల్లో పార్టీ అధ్యక్షుల నాయకత్వ పటిమే ప్రధానాంశం కానుంది. రాష్ట్రంలో 46 శాతం మంది ప్రజలు జగన్‌ నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. చంద్రబాబు పట్ల 39 శాతం మంది మొగ్గు చూపుతున్నారు.

మరిన్ని వార్తలు

24-05-2019
May 24, 2019, 08:46 IST
సాక్షి, న్యూఢిల్లీ:  బీజేపీ బిగ్‌ విక్టరీపై బాలీవుడ్‌ హీరోయిన్‌  కంగనా రనౌత్‌  హృదయపూర్వక అభినందనలు  తెలిపింది.  72 వ కేన్స్...
24-05-2019
May 24, 2019, 08:45 IST
మార్పు కోరుతూ సిక్కోలు తీర్పు చెప్పింది.. రామ రాజ్యం కోసం రాజన్న బిడ్డకే పట్టం కట్టింది.. జనం కోసం జనం...
24-05-2019
May 24, 2019, 08:45 IST
విజయవాడ సిటీ: ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ప్రతికూలమైన తీర్పు రావడంతో గుంటూరు జిల్లా ఉండవల్లిలోని ఆపద్ధర్మ ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసం...
24-05-2019
May 24, 2019, 08:41 IST
సాక్షి,సిటీబ్యూరో: అందరూ అనుకున్నట్టే హైదరాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గంపై మజ్లిస్‌ పార్టీ మరోసారి తన జెండా ఎగురవేసింది. ఎంపీగా అసదుద్దీన్‌ ఒవైసీ...
24-05-2019
May 24, 2019, 08:36 IST
సాక్షి,మేడ్చల్‌జిల్లా: మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి, పీసీసీ వర్కింగ్‌ ప్రసిడెంట్‌ ఎనుముల రేవంత్‌రెడ్డి విజయం సాధించారు. సమీప...
24-05-2019
May 24, 2019, 08:27 IST
సాక్షి, అమరావతి: వైఎస్సార్‌సీపీ సునామీలో టీడీపీ ఫ్యామిలీ ప్యాకేజీలు కొట్టుకుపోయాయి. రాయలసీమలో కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి దంపతులు...
24-05-2019
May 24, 2019, 07:23 IST
యావత్‌ భారతం హర హర మోదీ నినాదంతో ఊగిపోతే దక్షిణాది రాష్ట్రాల్లో కర్ణాటక, కొంతవరకు తెలంగాణలో మినహా ఇంకెక్కడా మోదీ...
24-05-2019
May 24, 2019, 07:18 IST
సాక్షి,సిటీబ్యూరో: లష్కర్‌ లోక్‌సభ స్థానంపై కాషాయ జెండా మరోమారు జయకేతనం ఎగురవేసింది. సీనియర్‌ నేతను బరిలో నిలిపి సిట్టింగ్‌ సీటును...
24-05-2019
May 24, 2019, 07:16 IST
ఇచ్చిన మాటకు ఆరునూరైనా కట్టుబాటు...చెక్కుచెదరని ధైర్యంతో ముందడుగు...ఆపదొస్తే అందరికీ నేనున్నాననే ఓదార్పు...అవసరమైతే కొండనైనా ఢీ కొట్టే తెగింపు...జన యాత్రలతో మమేకమయ్యే...
24-05-2019
May 24, 2019, 07:08 IST
సాక్షి, అమరావతి: సినీ నటుడు పవన్‌ కల్యాణ్‌ నేతృత్వంలోని జనసేన పార్టీని ఓటర్లు మట్టి కరిపించారు. ప్రతిపక్ష పార్టీకి దక్కాల్సిన ప్రభుత్వ...
24-05-2019
May 24, 2019, 07:06 IST
సాక్షి, అమరావతి: అమ్మ దీవించింది. అవ్వా తాతలు ఆశీర్వదించారు. అక్కచెల్లెమ్మలు ఆత్మీయత పంచారు.. అన్నా తమ్ముళ్లు అండగా నిలిచారు. అఖిలాంధ్ర...
24-05-2019
May 24, 2019, 06:51 IST
సాక్షి, అమరావతి: ఎన్నికల ఫలితాల్లో చంద్రబాబు మంత్రివర్గం దాదాపు గల్లంతైంది. 24 మంది మంత్రుల్లో 22 మంది పోటీచేయగా 19...
24-05-2019
May 24, 2019, 06:43 IST
భారతావని కమలవనమయ్యింది. చౌకీదార్‌ ప్రభంజనం సృష్టించాడు. చౌకీదార్‌ చోర్‌ హై అంటూ కాంగ్రెస్‌ నేతృత్వంలోని విపక్షాలు విసిరిన సవాళ్లు ఈ...
24-05-2019
May 24, 2019, 06:39 IST
సాక్షి ప్రతినిధి కడప: సార్వత్రిక ఎన్నికల్లో కడప గడపలో రికార్డుల మోత మోగింది. రాష్ట్రంలో అత్యధిక మెజార్టీ సాధించిన ఘనతను...
24-05-2019
May 24, 2019, 06:24 IST
సాక్షి, అమరావతి: కుప్పలు తెప్పలుగా హామీలు ఇచ్చి 2014 ఎన్నికల్లో ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చాక హామీలను తుంగలో తొక్కిన...
24-05-2019
May 24, 2019, 06:22 IST
లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి ప్రధాన ఎగ్జిట్‌ పోల్స్‌ చాలావరకు ఎన్డీయే విజయాన్ని, నరేంద్ర మోదీ మరోసారి ప్రధానిగా బాధ్యతలు చేపడతారనే...
24-05-2019
May 24, 2019, 06:19 IST
సాక్షి, అమరావతి: చంద్రబాబునాయుడు లోపాయికారీ పొత్తుల కుట్ర రాజకీయాలకు రాష్ట్ర ఓటర్లు చావుదెబ్బ కొట్టారు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చడం...
24-05-2019
May 24, 2019, 06:10 IST
పదిహేడో లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తరాదిని బీజేపీ ఊపేసింది. అనేక అంచనాలకు, సర్వేల ఫలితాలను మించి అత్యధిక స్థానాలను కైవసం చేసుకుంది....
24-05-2019
May 24, 2019, 05:48 IST
ఈవీఎంలో ఒక ఆప్షన్‌ ఉంటుంది. అదే నోటా... పైన తెలిపిన ఎవ్వరికీ నేను ఓటు వేయడం లేదు (నన్‌–ఆఫ్‌–ది ఎబవ్‌)...
24-05-2019
May 24, 2019, 05:33 IST
న్యూఢిల్లీ: 41 మంది సిట్టింగ్‌ మహిళా ఎంపీల్లో 28 మంది మహిళా ఎంపీలు ముందంజలో ఉన్నారు. సోనియా గాంధీ, హేమ...
Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top