‘పట్టిసీమ మొదలుకొని పంచభూతాల్ని తినేస్తున్నారు’

YSRCP Senior Leades Botsa Satyanarayana slams Chandrababus Government - Sakshi

విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో పరిపాలనను గాలికి వదిలేశారంటూ వైఎస్సార్‌ సీపీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ ధ్వజమెత్తారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వంలో ఎక్కడ చూసినా అవినీతి కంపే కొడుతుందన్నారు. ఆదివారం పార్టీ కార్యాలయంలో ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లో మాట్లాడిన బొత్స.. పట్టిసీమ మొదలుకొని పంచభూతాల్ని తినేస్తున్న చరిత్ర చంద్రబాబు ప్రభుత్వానిదే అంటూ మండిపడ్డారు. గతంలో ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను పక‍్కను  పెట్టిన ప్రభుత్వం.. అవినీతికి పెద్ద పీట వేస్తుందంటూ బొత్స విమర్శించారు. ఏపీ ప్రభుత్వంలో కార్యకర్తల నుంచి సీఎం స్థాయి వరకూ అంతా అవినీతే కనబడుతుందన్నారు.

బొత్స ఇంకా ఏమన్నారంటే..

*నాలుగేళ్లు బీజేపీతో కలుసున్న టీడీపీ ఇప్పుడు డ్రామాలు చేస్తుంది
* బీజేపీ నుంచి టీడీపీ లబ్ధి పొందుతూనే ధర్మదీక్ష అంటూ ప్రజల్ని మోసం చేసే యత్నం చేస్తోంది
*చంద్రబాబు పట్ల ఏపీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
*కేంద్రంపై పోరాటం అంటూ డ్రామాలు చేస్తున్నారు
*రాష్ట్రంలో 5 కోట్ల మంది ప్రత్యేక హోదా కోరుతున్నారు
*చట్టంలో చేసిన అంశాలను కూడా అంగీకరించరా?
*రాష్ట అభివృద్ధి కోసం ఏనాడు ప్రభుత్వం పట్టించుకున్న దాఖలాలు లేవు
*బీజేపీ ఏ ఉద్దేశంతో ఉందో అర్థం కావడం లేదు
*ఇలాగే వ్యవహరిస్తే కాంగ్రెస్‌కు ఎదురైన పరిస్థితే బీజేపీకి ఎదురవుతుంది
*బీజేపీ ఆలోచన మార్చుకోవాలి
*మా ఎంపీల రాజీనామాలపై కూడా విమర్శలు వచ్చాయి
*ఏపీ ప్రజల ప్రాణాలతో ఆడుకోవద్దని బీజేపీ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం
*కాపు రిజర్వేషన్లపై వైఎస్‌ జగన్‌ ఉన్నది ఉన్నట్లు చెప్పారు
*ప్రజలను మభ్య పెట్టకూడదని జగన్‌ తన అభిప్రాయం చెప్పారు
*కాపులను జగన్‌ ఎప్పటికీ మోసం చేయరు
*చంద్రబాబులా హామీలిచ్చి మోసం చేయలేం
*కాపు రిజర్వేషన్లపై మేం ఇప్పటికీ వ్యతిరేకం కాదు
*విభజన హామీలను నెరవేరుస్తాంటారు.. విశాఖ రైల్వే జోన్‌ సాధ్యం కాదని మీరు చెప్తారు
*బీజేపీ నేతలు ఒక్కొక్కరూ ఒక్కో మాట చెబుతున్నారు
*విశాఖ రైల్వేజోన్‌ కుదరదని చెప్తుంటే చంద్రబాబు ఏంచేస్తున్నారు
*హోదాపై ఇంకా ఎంత మందిని పొట్టన పెట్టుకుంటారు
*రెండెకరాల నుంచి రూ. లక్షల కోట్లు ఎలా సంపాదించారు చంద్రబాబు?
*ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్‌ సీపీ ఎంపీలు పదవులు త్యాగం చేశారు
*హోదా కోసం టీడీపీ ఎంపీలు ఏం చేశారు?
*అవిశ్వాసంతో ప్రయోజనం ఉండదని బాబు యూటర్న్‌ తీసుకున్నారు
*ధర్మపోరాట సభలు ఇక్కడ కాదు.. ఢిల్లీలో చేయాలి
*అవిశ్వాసానికి మద్దతు కూడగడతానన్న పవన్‌ కనిపించకుండా పోయారు
*మిత్రపక్షంగా ఉన్నప్పుడు పవన్‌ కల్యాన్‌ ఎప్పుడైనా బాబును నిలదీశారా?

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top