‘రాజీనామా చేయకుండా దీక్షలు చేస్తే నమ్మరు’ | YSRCP MP Vijaya sai Reddy Padayatra Reached Fifth Day In Visakapatnam | Sakshi
Sakshi News home page

May 6 2018 11:26 AM | Updated on Aug 9 2018 2:44 PM

YSRCP MP Vijaya sai Reddy Padayatra Reached Fifth Day In Visakapatnam - Sakshi

ఐదో రోజు పాదయాత్రలో విజయసాయిరెడ్డి, వైఎస్సార్‌ సీపీ నేతలు

సాక్షి, విశాఖపట్నం : వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రజాసంకల్పయాత్రకు సంఘీభావంగా రాజ్యసభ రాజ్యసభ్యుడు వి. విజయసాయి రెడ్డి చేపట్టిన పాదయాత్ర ఐదో రోజుకు చేరుకుంది. ప్రహ్లాదపురం నుంచి ఆదివారం ఆయన పాదయాత్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా పంచ గ్రామ ప్రజలు పాదయాత్రలో ఎంపీ ఎదుట తమ సమస్యల్ని చెప్పుకున్నారు. ఈ సందర్భంగా విజయసాయి రెడ్డి మాట్లాడుతూ.. వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అధికారంలోకి రాగానే పంచ గ్రామాల సమస్యలు పరిష్కరిస్తామని వివరించారు. ప్రస్తుతం ఎంపీ నిధులతో ప్రభుత్వ ఆసుపత్రిలో సదుపాయాలను మెరుగు పరుస్తానని హామీయిచ్చారు.

పదవులకు రాజీనామా చేయకుండా టీడీపీ నాయకులు దీక్షలు చేస్తే జనం నమ్మే స్థితిలో లేరని విజయసాయి రెడ్డి తెలిపారు. ఐదో రోజు ఎంపీ పాదయాత్రలో మాజీ ఎమ్మెల్యే కన్నబాబు, వైఎస్సార్‌ సీపీ నగర అధ్యక్షులు మళ్ల విజయప్రసాద్‌, మాజీ ఎమ్మెల్యే తైనాల విజయ కుమార్‌, వైఎస్సార్‌ సీపీ నేతలు గుడివాడ అమర్నాథ్‌, నాగిరెడ్డి, కోలా గురువులు, జాన్‌వెస్లీ, పక్కి దివాకర్‌, ఆదిరెడ్డి మురళి, దొడ్డి కిరణ్‌, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement