‘రాష్ట్రం బాగుపడటం చంద్రబాబు, పవన్‌కు ఇష్టం లేదు’ | YSRCP MLA Shankar Narayana Slams On Chandrababu Naidu And Pawan Kalyan In Kurnool | Sakshi
Sakshi News home page

‘రాష్ట్రం బాగుపడటం చంద్రబాబు, పవన్‌కు ఇష్టం లేదు’

Nov 25 2019 3:36 PM | Updated on Nov 25 2019 3:48 PM

YSRCP MLA Shankar Narayana Slams On Chandrababu Naidu And Pawan Kalyan In Kurnool - Sakshi

సాక్షి, కర్నూలు: గత ప్రభుత్వ హయాంలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయడు రాష్ట్రాన్ని అప్పుల ఊబీలో ముంచి దివాల తీయించేలా చేశాడని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే శంకర్‌నారాయణ మండిపడ్డారు. సోమవారం విలేకురుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వం పేరు, ప్రత్యేకత కోసం పెద్ద ఎత్తున అప్పులు చేసిందని ఆయన అన్నారు. రాష్ట్రం బాగుపడటం చంద్రబాబుకు ఆయన దత్త పుత్రుడు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌కు  ఇష్టం లేదని, ఇందుకోసమే పదే పదే అడ్డుపుల్లలు వేస్తూ విమర్శిస్తున్నారని అన్నారు. గత ప్రభుత్వ పథకాలను పచ్చచొక్క నాయకులకే ఇళ్లు, పెంచన్లు, జన్మభూమి పేరిట పంచి పెట్టారని పేర్కొన్నారు. రాష్ట్రంలో పేద ప్రజలు ఎటువంటి పక్షపాతం లేకుండా పథకాలను అందేలా తమ ప్రభుత్వం చోరవ తీసుకుంటుందని ఎమ్మెల్యే తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement