విమర్శించేందుకు టీడీపీకి సిగ్గు ఉండాలి.. | YSRCP Leaders Slams TDP In YSR District | Sakshi
Sakshi News home page

విమర్శించేందుకు టీడీపీకి సిగ్గు ఉండాలి..

May 17 2018 12:25 PM | Updated on Aug 10 2018 8:42 PM

YSRCP Leaders Slams TDP In YSR District - Sakshi

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే అంజాద్‌ బాషా, కడప పార్లమెంట్‌ అధ్యక్షుడు సురేశ్‌ బాబు

సాక్షి,  వైఎస్సార్‌ కడప : వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీని విమర్శించేందుకు టీడీపీకి సిగ్గుండాలని కడప ఎమ్మెల్యే అంజద్‌ బాషా, ఆ పార్టీ కడప పార్లమెంట్‌ అధ్యక్షుడు సురేశ్‌ బాబు వ్యాఖ్యానించారు. గురువారం వారు మీడియాతో మాట్లాడుతూ.. వార్డు మెంబర్‌గా కూడా గెలవలేని వ్యక్తులు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఢిల్లీలో కడప అంటే ఏంటో చూపించిన నాయకుడు వైఎస్‌ జగన్‌ అని అన్నారు.

కేసులు పెడతారని తెలిసి కూడా కొత్త పార్టీ పెట్టిన ఏకైక నాయకుడు వైఎస్‌ జగన్‌ అని గుర్తు చేశారు. ఏపీకి ప్రతేక హోదా కోసం తమ పదవులకు రాజీనామాలు చేసిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీలను.. రాజీనామాలను ఆమోదించుకుని ఎన్నికలకు రావానలి టీడీపీ చెప్పడం సిగ్గుచేటని విమర్శించారు. టీడీపీ, బీజేపీతో లోపాయికారి ఒప్పందం చేసుకుందని ఆరోపించారు. అందులో భాగంగానే కర్ణాటక ఎన్నికల్లో బీజేపీకి మద్దతు ఇచ్చి.. తిరిగి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీపై విమర్శలు చేయడం దారుణం అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement