‘బాబుకు బుద్ధి చెప్పేందుకు ఉద్యోగులు సిద్ధం’ | YSRCP Leader Vennapusa Gopal Reddy Takes On Chandrababu and Ashok babu | Sakshi
Sakshi News home page

‘బాబుకు బుద్ధి చెప్పేందుకు ఉద్యోగులు సిద్ధం’

Jun 29 2018 3:54 PM | Updated on Aug 20 2018 6:07 PM

YSRCP Leader Vennapusa Gopal Reddy Takes On Chandrababu and Ashok babu - Sakshi

ప్రభుత్వ ఉద్యోగుల జీవితాలతో చంద్రబాబు సర్కార్ చలగాటం ఆడుతోందని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత వెన్నపూస గోపాల్‌ రెడ్డి ఆరోపించారు.

సాక్షి, అనంతపురం: ప్రభుత్వ ఉద్యోగుల జీవితాలతో చంద్రబాబు సర్కార్ చలగాటం ఆడుతోందని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత వెన్నపూస గోపాల్‌ రెడ్డి ఆరోపించారు. ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. ఉద్యోగుల ప్రయోజనాలను చంద్రబాబు వద్ద అశోక్ బాబు తాకట్టు పెడుతున్నారని మండిపడ్డారు.

ఉద్యోగుల 15 రోజుల వేతనాన్ని విరాళంగా ఇచ్చేందుకు అశోక్ బాబు ఎవరు? ఉద్యోగుల అంగీకారం లేకుండానే 200 కోట్లు లాగేసుకుంటారా? అని ప్రశ్నించారు. చంద్రబాబు, అశోక్ బాబులకు ఉద్యోగులు బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement