‘అశోక్‌బాబు రాజకీయ నేతగా వ్యవహరిస్తున్నారు’ | YSRCP leader vennapusa gopal reddy slams chandrababu naidu | Sakshi
Sakshi News home page

‘అశోక్‌బాబు రాజకీయ నేతగా వ్యవహరిస్తున్నారు’

May 17 2018 3:43 PM | Updated on May 29 2018 4:40 PM

YSRCP leader vennapusa gopal reddy slams chandrababu naidu - Sakshi

సాక్షి, అనంతపురం: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు రాష్ట్రంలోని ఉద్యోగుల సమస్యలు పట్టడం లేదని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌రెడ్డి ఆరోపించారు. ఆయన గురువారం మీడి​యాతో మాట్లాడుతూ.. ఉద్యోగులకు సంబంధించి రెండు డీఏలు పెండింగ్‌లో ఉన్నాయన్నారు.

అంతే కాకుండా 10వ పీఆర్సీ బకాయిలు కూడా ఇంకా ఇవ్వలేదని తెలిపారు. ఉద్యోగుల డిమాండ్‌లపై ఎన్జీవో నేత అశోక్‌బాబు పోరాడటం లేదని విమర్శించారు. అశోక్‌బాబు రాజకీయ నేతగా వ్యవహరించడం సరికాదని పేర్కొన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement