హోదాపై చంద్రబాబుది పూటకో మాట | YSR Congress MLA Isaiah Slams chandrababu | Sakshi
Sakshi News home page

Mar 17 2018 3:23 PM | Updated on Mar 23 2019 9:10 PM

YSR Congress MLA Isaiah Slams chandrababu - Sakshi

సాక్షి, కర్నూలు : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీరుపై వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే ఐజయ్య  మండిపడ్డారు. నాలుగేళ్లుగా చంద్రబాబు పరిపాలన అంతా అవినీతిమయంగా మారిందని ధ్వజమెత్తారు. కేవలం రెండు ఎకరాల ఆసామి అయిన చంద్రబాబుకు లక్ష వేల కోట్ల రూపాయలు ఎక్కడినుండి వచ్చాయో చెప్పాలని నిలదీశారు. శనివారం కర్నూలులో ఆయన విలేకరులతో మాట్లాడారు.  

ప్రత్యేక హోదాపై చంద్రబాబు పూటకో మాట మాట్లాడుతూ.. ఏపీ ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. పార్లమెంటులో వైఎస్ఆర్‌సీపీ అవిశ్వాస తీర్మానానికి మద్దత్తు ఇస్తానని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు మళ్ళీ యూటర్న్ తీసుకున్నారని ఆరోపించారు. బీజేపీతో కాపురం చేసి 24 సార్లు ఢిల్లీకి వెళ్ళానని చెప్తున్న చంద్రబాబు ఏం సాధించాడో ప్రజలకు చెప్పాలన్నారు. నాలుగేళ్లు గడిచినా ఒక్క నిరుద్యోగికైనా చంద్రబాబు ఉద్యోగం కల్పించారా అని ప్రశ్నించారు. శేఖర్ రెడ్డికి, లోకేష్ బాబుకు మధ్య ఏం సంబంధం ఉందో చంద్రబాబు బయటపెట్టాలని డిమాండ్‌ చేశారు. శేఖర్ రెడ్డిని అడ్డుపెట్టుకొని లోకేష్ వేల కోట్లు సంపాదించారని ఆరోపించారు. ప్రత్యేక హోదా కోసం సోమవారం పార్లమెంటులో చేపట్టనున్న అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా ప్రజలతో మమేకమై ప్రజాసంకల్ప మానవహారం చేపట్టబోతున్నామని ఐజయ్య వెల్లడించారు.

Advertisement
 
Advertisement
Advertisement