‘నష్టం కలిగిస్తే ఉగ్ర నరసింహుడినే!’ | Warangal Greater Mayor about mla ticket | Sakshi
Sakshi News home page

‘నష్టం కలిగిస్తే ఉగ్ర నరసింహుడినే!’

Jul 22 2018 2:19 AM | Updated on Jul 22 2018 2:19 AM

Warangal Greater Mayor about mla ticket - Sakshi

వరంగల్‌ అర్బన్‌: ‘‘ఎమ్మెల్యే టిక్కెట్‌ బాజాప్తా అడుగుతా.. నేనే కాదు.. తెలంగాణ ఉద్యమం కోసం పనిచేసిన ప్రతి టీఆర్‌ఎస్‌ కార్యకర్తకు ఆ హక్కు ఉంది. నాకు రాజకీయంగా నష్టం కలిగిస్తే ఉగ్ర నరసింహ అవతారమెత్తుతా’’అని వరంగల్‌ గ్రేటర్‌ మేయర్‌ నన్నపునేని నరేందర్‌ అన్నారు.

శనివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఇటీవల ఎమ్మెల్యే కొండా సురేఖ చేసిన పలు విమర్శలపై ఘాటు గా బదులిచ్చారు. తాను 2009 నుంచి ఉద్య మంలో పనిచేస్తున్నానని, 2014లో వరంగల్‌ తూర్పు టిక్కెట్‌ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్‌ను అడిగానన్నారు. బంగారు తెలంగాణ కోసం కేసీఆర్‌ ఆదేశంతో పార్టీ అభ్యర్థి గెలుపు కోసం అహర్నిశలు కృషి చేశానని పేర్కొన్నారు. సురేఖను తరిమికొట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement