సెక్స్‌ రాకెట్‌ కేసు.. ఏమంటారు చంద్రబాబు? | Vasireddy Padma Slams Chandrababu Neglects Call Money Case | Sakshi
Sakshi News home page

సెక్స్‌ రాకెట్‌ కేసు.. ఏమంటారు చంద్రబాబు?

Jun 21 2018 3:53 PM | Updated on Aug 28 2018 4:32 PM

Vasireddy Padma Slams Chandrababu Neglects Call Money Case - Sakshi

వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ

సాక్షి, హైదరాబాద్‌ : తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన షికాగో సెక్స్‌ రాకెట్‌ కేసు వెనుక పలువురు పెద్దల హస్తం ఉందని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ఆరోపించారు. తెలుగు అసోసియేషన్‌ ఆఫ్‌ నార్త్‌ అమెరికా(తానా) ప్రెసిడెంట్‌ సతీష్‌ వేమన.. చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు నారా లోకేష్‌కు సన్నిహితుడైనందున ఏపీ ముఖ్యమంత్రి దీనిపై సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఇక్కడి పార్టీ ప్రధాన కార్యాలయంలో గురువారం మీడియాతో మాట్లాడుతూ వాసిరెడ్డి పద్మ షికాగో సెక్స్‌ రాకెట్‌ కేసు గురించి పలు వ్యాఖ్యలు చేశారు.

ఇలాంటి విషయాలతో అమెరికాలో ఉంటున్న తెలుగువారి పరువు తీశారంటూ ఆమె మండిపడ్డారు. గతంలో ఏపీలో కలకలం రేపిన కాల్‌మనీ సెక్స్‌ రాకెట్‌పై వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా ప్రశ్నిస్తే, ఆమెను ఏడాదిపాటు సస్పెండ్‌ చేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు. కాల్‌మనీ సెక్స్‌ రాకెట్‌ కేసులో టీడీపీ నేతలు ఉండటంతో ఆ కేసును ఏపీ ప్రభుత్వం నీరుగార్చిందని విమర్శించారు. ఇప్పుడు రాష్ట్రంలోని ప్రతి మహిళ కాల్‌మనీ సీఎం అనే పరిస్థితిని తీసుకొచ్చారని వాసిరెడ్డి పద్మ పేర్కొన్నారు.

చంద్రబాబు, లోకేష్‌కు సన్నిహితుడైన తానా అధ్యక్షుడు వేమన సతీష్‌ను అమెరికా పోలీసులు పలుమార్లు విచారించారు. కాగా, టీడీపీలో కూడా సతీష్‌ క్రియాశీలకంగానే ఉంటారన్న విషయం తెలిసిందే. షికాగో సెక్స్‌ రాకెట్‌ కేసులో తానాకు చెందిన పలువురు ప్రముఖుల పేర్లతో పాటు ఇటీవల వెలుగుచూసిన డైరీలో ఓ ఏపీ మంత్రి, ఎంపీ పేర్లు ఉన్నట్లు సమాచారం. అమెరికా పోలీసులు కోర్టులో దాఖలు చేసిన 40 పేజీల అఫిడవిట్‌ సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేస్తోంది. బాధితుల జాబితాలో 10 మంది హీరోయిన్లు ఉన్నట్లు అమెరికా పోలీసులు అఫిడవిట్‌లో పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement