టికెట్‌ దక్కలేదని ఆత్మహత్యాయత్నం | TRS Leader Suicide Attempt in Medchal | Sakshi
Sakshi News home page

మున్సిపాలిటీ టికెట్‌ దక్కలేదని మనస్తాపం

Jan 15 2020 8:33 AM | Updated on Jan 15 2020 8:33 AM

TRS Leader Suicide Attempt in Medchal - Sakshi

పోలీస్‌స్టేషన్‌లో విజయ్‌కుమార్‌

మేడ్చల్‌: మేడ్చల్‌ మున్సిపాలిటీలోని 14 వార్డు టికెట్‌ దక్కలేదని మనస్తాపం చెందిన టీఆర్‌ఎస్‌ నాయకుడు మంగళవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. బాధితుడి కథనం మేరకు వివరాలు.. మేడ్చల్‌కు చెందిన టీఆర్‌ఎస్‌ నాయకుడు ఎల్‌టీ. విజయ్‌కుమార్‌ ఎస్సీ వర్గానికి చెందినవారు. గతంలో ఉద్యమ నాయకుడిగా పనిచేశారు. మేడ్చల్‌ పట్టణంలోని 14 వార్డు (జనరల్‌)కు మున్సిపల్‌ ఎన్నికల్లో భాగంగా టికెట్‌ కోసం దరఖాస్తు చేసుకుని నామినేషన్‌ వేశారు.

పార్టీ అధిష్టానం మరో ఉద్యమకారుడు వీరభద్రారెడ్డికి టికెట్‌ కేటాయించింది. తనకు టికెట్‌ రాలేదని మనస్తాపానికి గురైన విజయ్‌కుమార్‌ మంగళవారం ఉదయం తనకు పరిచయం ఉన్న నేతలకు సమాచారమిచ్చి స్థానిక అంబేడ్కర్‌ విగ్రహం వద్ద ఒంటిపై పెట్రోల్‌ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. అంతకుముందు తాను ఆత్మహ్య త్య చేసుకుంటున్నానంటూ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ భాస్కర్‌ యాదవ్‌కు ఫోన్‌ చేసి చెప్పారు. ఈ విషయాన్ని భాస్కర్‌యాదవ్‌ పోలీసులకు చెప్పారు. దీంతో పోలీసులు అక్కడకు చేరుకుని విజయ్‌కుమార్‌ ఒంటిపై నీరు పోసి పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు. అనంతరం భాస్కర్‌ యాదవ్, టీఆర్‌ఎస్‌ పట్టణ అ«ధ్యక్షుడు రవీందర్‌రెడ్డి విజయ్‌ను సముదాయించి ఇంటికి పంపించారు. తాను టీఆర్‌ఎస్‌లో 10 ఏళ్లుగా పని చేస్తున్నానని, తనకు మున్సిపాలిటీ టికెట్‌ రాలేదనే ఆవేదనతోనే ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు తెలిపారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement