
తిరుమలలో టీఆర్‌ఎస్ నేత హరీశ్‌రావు (ఫైల్ ఫోటో)
సాక్షి, హైదరాబాద్: టీఆర్‌ఎస్ ట్రబుల్ షూటర్, మాజీ మంత్రి హరీశ్‌రావు సోమవారం ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలకు చేరుకున్నారు. ఆయన మరికాసేపట్లో తిరుమల వెంకటేశ్వరస్వామిని దర్శించుకోనున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సిద్దిపేట నియోజకవర్గం నుంచి లక్ష ఓట్లకుపైగా మెజారిటీతో గెలుపొంది హరీశ్‌రావు సరికొత్త రికార్డులు నెలకొల్పిన సంగతి తెలిసిందే. గత ప్రభుత్వంలో హరీశ్‌రావు భారీ నీటిపారుదల, మార్కెటింగ్ సహా పలు శాఖలను సమర్థంగా నిర్వహించారు. కేసీఆర్ త్వరలో ఖరారు చేయనున్న తన మంత్రివర్గంలో హరీశ్‌కు తాజాగా ఏ మంత్రిత్వశాఖ కేటాయిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.