నాలుగు ఎమ్మెల్సీలు టీఆర్‌ఎస్‌ కైవసం | TRS And Their Ally MIM Won ALL Five Seats In MLC Elections | Sakshi
Sakshi News home page

టీఆర్‌ఎస్‌కు నాలుగు.. ఎంఐఎంకు ఒకటి

Mar 12 2019 6:38 PM | Updated on Mar 12 2019 7:59 PM

TRS And Their Ally MIM Won ALL Five Seats In MLC Elections - Sakshi

హైదరాబాద్‌: ఎమ్మెల్సీ ఎన్నికల్లో అంతా అనుకున్నట్లే జరిగింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు ఎదురులేకుండా పోయింది. ఉన్న ఐదుస్థానాల్లో నాలుగు టీఆర్‌ఎస్‌, మిత్రపక్షమైన ఎంఐఎం ఒక స్థానంలో గెలిచాయి. టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీలుగా శేరిసుభాష్‌ రెడ్డి, యెగ్గె మల్లేషం, సత్యవతి రాథోడ్‌, మహ్మద్‌ అలీలు గెలిచారు. ఎంఐఎం తరపు నుంచి రియాజుల్‌ హసన్‌ గెలుపొందారు. టీఆరెఎస్‌ అభ్యర్థులకు 20 చొప్పున ఓట్లు రాగా.. ఎంఐఎం అభ్యర్థికి 19 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను బహిష్కరించడంతో టీఆర్‌ఎస్‌ గెలుపు మరింత తేలికైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement