‘కరెక్ట్‌ టైంలో మంచి నిర్ణయం తీసుకుంటాం’ | TPCC Chief Uttam Kumar Reddy Chit Chat With Media | Sakshi
Sakshi News home page

Oct 24 2018 6:05 PM | Updated on Sep 19 2019 8:44 PM

TPCC Chief Uttam Kumar Reddy Chit Chat With Media - Sakshi

టీఆర్‌ఎస్‌ గ్రాఫ్‌ రోజు రోజుకి పడిపోతుంది. ఆ పార్టీకి 30 సీట్లకు మించి రావని...

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణలో టీఆర్‌ఎస్‌ గ్రాఫ్‌ రోజు రోజుకి పడిపోతూ.. కాంగ్రెస్‌ గ్రాఫ్‌ పెరుగుతుందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి అన్నారు. గాంధీ భవన్‌లో బుధవారం మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడిన ఉత్తమ్‌.. టికెట్ల విషయంలో తమ పార్టీ సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటుందన్నారు. ముందుగా టికెట్లు ప్రకటించినంత మాత్రాన అది మంచి నిర్ణయం అనుకోవద్దన్నారు. అసెంబ్లీ టికెట్లను ముందుగా ప్రకటించి టీఆర్‌ఎస్‌ నష్టపోతుందని వ్యాఖ్యానించారు.

కాంగ్రెస్‌లో టికెట్లకోసం ఐదు వేలమంది అప్లై చేసుకున్నా.. వచ్చేది 100 మందికేనన్నారు. టికెట్లు రాకపోయినా పార్టీ గెలుపు కోసం పనిచేసే నాయకులకు ప్రభుత్వంలో సముచిత స్థానం కల్పిస్తామని చెప్పారు. ఎన్నికల వ్యూహమే ప్రధానంగా ఢిల్లీ చర్చలు జరిగాయన్నారు. 18-39ఏళ్ల వారిని ఎలా ఆకట్టుకోవాలన్న అంశంపై వ్యూహ రచన జరిగిందని ఉత్తమ్‌ చెప్పారు. ఇందిరా గాంధీ వర్దంతి(అక్టోబర్‌ 31) సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా డోర్‌ టు డోర్‌ ప్రచారం నిర్వహిస్తున్నామని ఉత్తమ్‌ పేర్కొన్నారు. నవంబర్‌ 1-7 వరకు బూత్‌ లెవల్‌ సదస్సులు నిర్వహిస్తామన్నారు. సీట్ల సర్దుబాటుపై చర్చలు జరుగుతున్నాయని, గెలుపు, సామాజిక న్యాయం ప్రకారం టికెట్ల కేటాయింపు ఉంటుందన్నారు. 

కాంగ్రెస్‌ నేతల పోన్లను ట్యాప్‌ చేస్తున్నారు
కాంగ్రెస్‌ నేతల పోన్లను ట్యాప్‌ చేస్తున్నరని ఉత్తమ్‌ మండిపడ్డారు. డీఐజీ ప్రభాకర్‌ రావు, నర్సింగరావు, రాదాకిషన్‌ రావులు తమ నేతల పోన్లను ట్యాప్‌ చేస్తున్నారని ఆరోపించారు. ఫోన్ల ట్యాపింగ్‌పై ఇప్పటికే ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశామన్నారు. టీఆర్‌ఎస్‌కు 30 సీట్లకు మించి రావని జోస్యం చెప్పారు. ప్రగతి భవన్‌లో టీఆర్‌ఎస్‌ కార్యక్రమాలు పెట్టడాన్ని వ్యతిరేకిస్తున్నామన్నారు. ఈ విషయంపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని ఉత్తమ్‌ చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement