ఆరుతోనే సరి..!

Telangana ZPTC And MPTC Election Nominations Warangal - Sakshi

సాక్షి, వరంగల్‌ రూరల్‌ : స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకగ్రీవాల జోరు సాగింది. ప్రాదేశికానికి వచ్చే సరికే చతికిలపడినట్లయింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో 401 గ్రామాలకు గాను 107 గ్రామాలు ఏకగ్రీవమయ్యాయి. అధికార పార్టీ ప్రజాప్రతినిధులు అహర్నిశలు కష్డపడి ఏకగ్రీమమయ్యేందుకు కృషి చేశారు. కాని ప్రాదేశిక ఎన్నికల్లో ప్రయత్నం చేసినా వారి కృషి ఫలించలేదు. గ్రామ పం చాయతీ ఎన్నికల్లో కనిపించిన స్పందన పరిషత్‌ ఎన్నికల్లో కనిపించలేదు.

నజరానా తెచ్చిన తంటా..
సర్పంచ్‌ ఎన్నికలప్పుడు ఏకగ్రీవమైతే రూ.10 లక్షలు నుంచి ప్రభుత్వం నుంచి నజరానా అం దుతుంది. అంతేగాకుండా ఎమ్మెల్యేలు తమ సీడీఎఫ్‌ నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. దీంతో సర్పంచ్‌ ఎన్నికల్లో ఎక్కువ స్థానాలు ఏకగ్రీవమవడానికి కారణమని చెప్పొచ్చు.

దక్కని ఫలితం..
జిల్లాలో ఇటీవల జరిగిన సర్పంచ్‌ ఎన్నికల మాధిరిగా ఎంపీటీసీ, జెడ్పీటీసీలు కూడా ఏకగ్రీవం చేసేందుకు టీఆర్‌ఎస్‌ ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించింది. ఏకగ్రీవాల కోసం ఎమ్మెల్యేలు పల్లెల్లో తిరుగుతూ ఇతర పార్టీలకు చెందిన వారిని పార్టీలోకి చేర్చుకుంటూ వారికి ఇతర పదవులపై భరోసా ఇచ్చారు. పోటీలేకుండా చేయాలని ఎమ్మెల్యేలు  సాధ్యమైనంత వరకు కృషి చేశారు. వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్‌ మరో అడుగు ముందుకేసి ఏకగ్రీవం చేసిన ఎంపీటీసీ స్థానానికి తన సీడీఎఫ్‌ నిధుల నుంచి రూ.15లక్షలు వెచ్చి ంచి అభివృద్ధి పనులు చేస్తానని హామీలు ఇచ్చా రు. అయినప్పటికీ పోటీ తప్పలేదు. ఎమ్మెల్యేలు ఎంత కృషి చేసినా ఫలితం దక్కలేదు.

జిల్లాలో  16 జెడ్పీటీసీ, 178 ఎంపీటీసీలు స్థానాలున్నాయి. మూడు దశల్లో ఎన్నికలు నిర్వహించేందుకు జిల్లా ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే నామినేషన్లు స్వీకరించారు. రెండు దశల్లో జరిగే మండలల్లో అభ్యర్థులకు గుర్తులు సైతం కేటాయించారు. మూడో విడతలో జరిగే మండలాల్లో ఈ నెల 6 వరకు నామినేషన్ల ఉపసంహరణ ఉంది. ఆ మండలాల్లో జెడ్పీటీసీ, ఎంపీటీసీలకు నామినేషన్‌ వేసిన వారు విత్‌డ్రా చేసుకుని ఆయా స్థానాల నుంచి ఒక్కరు మిగిలితే ఏకగ్రీవమయ్యే అవకాశాలున్నాయి.

ఏకగ్రీమైన గ్రామాలివే.. 
రాయపర్తి మండలంలోని కొండాపురంలో ఎలగందుల యాకనారయణ, కేశావాపురంలో బానోత్‌ శ్వేత, దుగ్గొండి మండలంలో మల్లంపల్లిలో పల్లాటి జయపాల్‌ రెడ్డి, సంగెం మండలం కుంటపల్లిలో కందకట్ల కళావతి, వర్ధన్నపేట మండలంలో నల్లబెల్లి ఎంపీటీసీ జ్యోతి మాధవరావు, దమ్మన్నపేటలో చొప్పరి సోమలక్ష్మీలను ఏకగ్రీవాలుగా ఎన్నుకున్నారు. జెడ్పీటీసీలు ఒక్కటి కూడా ఏకగ్రీవం కాకపోవడం గమనార్హం.

107 గ్రామాలు ఏకగ్రీవం
ఇటీవల జరిగిన గ్రామ సర్పంచ్‌ ఎన్నికల్లో జిల్లాలో 401 గ్రామ పంచాయతీలుండగా అందులో 107 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం ఏకగ్రీవం చేసిన గ్రామ పంచాయతీకి రూ.10లక్షల నిధులు కేటాయిస్తామని, అలాగే స్థానిక ఎమ్మెల్యేలు సైతం సీడీఎఫ్‌ నిధుల నుంచి గ్రామ అభివృద్ధి నిధులు కేటాయిస్తామని హామీలు ఇచ్చారు. అలాగే కొన్ని గ్రామాల్లో వేళం పాటలు సైతం నిర్వహించి ఏకగ్రీవం చేశారు. గ్రామ పంచాయతీలు ఏకగీవ్రం కావడంతో జిల్లా ఎన్నికల అధికారులు, రాజకీయ నాయకులకు పని భారం తప్పింది. ఇప్పుడు అయితే దాదాపు 172 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరిగే అవకాశాలున్నాయి. ఈ నెల 6తో తెలిపోనుంది. ఇంకా ఎక్కడైన ఏకగ్రీవాలు అవుతాయో లేవోనని తేలనుంది.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top