వైస్సార్‌సీపీలో చేరిన టీడీపీ తిరుపతి అధ్యక్షుడు

TDP Tirpati Rural President and Other TDP Activists Joins In YSR Congress Party - Sakshi

సాక్షి, తిరుపతి: పార్టీలకు అతీతంగా గ్రామాల అభివృద్ధికి కలసికట్టుగా కృషి చేద్దామంటూ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి పిలుపు\నిచ్చారు. తుమ్మలగుంటలోని తెలుగుతల్లి విగ్రహం నుంచి వేదాంతపురం వరకు స్థానిక యువత బుధవారం చేపట్టిన భారీ బైక్‌ ర్యాలీలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన ఆధ్యర్యంలో తిరుపతి రూరల్‌ టీడీపీ అధ్యక్షుడు చెరుకుల జనార్థన్‌ యాదవ్‌, అతని అనుచరులు వైఎస్సార్‌సీపీలో చేరారు. ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి వారికి వైఎస్సార్‌సీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం జనార్థన్‌ యాదవ్‌ మాట్లాడుతూ.. ఎమ్మెల్యే చెవిరెడ్డి పోరాట పటిమ తనను ఆకర్షించిందన్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్ని వర్గాల అభివృద్ధికి కృషి చేస్తున్నారని తెలిపారు. 

కృష్ణా జిల్లా: మోపిదేవి మండల పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే అవనిగడ్డ రమేష్‌ బాబు అధ్వర్యంలో టీడీపీ, జనసేన కార్యకర్తలు వైఎస్సార్‌సీపీలో చేరారు. 70 కుటుంబాలకు చెందిన కార్యకర్తలను ఎమ్మెల్యే  రమేష్‌బాబు వైఎస్సార్‌సీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. 

గుంటూరు: మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వెల్దుర్తి మండలం గుండ్లపాడుకు చెందిన 100 కుటుంబాలకు చెందిన టీడీపీ కార్యకర్తలను వైఎస్సార్‌సీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top