సాక్షి, అమరావతి : తెలుగుదేశం పార్టీ 15 మందితో తమ ఎమ్మెల్యే అభ్యర్థుల రెండో జాబితాను విడుదల చేసింది. మరో 34 అసెంబ్లీ స్థానాలను పెండింగ్ పెట్టారు. 126 మంది అభ్యర్థులతో తొలి జాబితా ప్రకటించిన టీడీపీ.. శనివారం అర్ధరాత్రి దాటాక రెండో జాబితాను ప్రకటించింది.పాలకొండ నుంచి నిమ్మక జయకృష్ణకు, తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం నుంచి ఎస్‌వీఎస్ఎన్ వర్మకు టికెట్ దక్కింది. రంపచోడవరం నుంచి వంతల రాజేశ్వరికి అవకాశమిచ్చింది. రాయదుర్గంలో మంత్రి కాలవ శ్రీనివాసులకు మరో అవకాశం కల్పించారు. (126 మందితో టీడీపీ తొలి జాబితా)
| అభ్యర్థి పేరు | నియోజకవర్గం |
పాలకొండ |
నిమ్మక జయకృష్ణ |
| పిఠాపురం | ఎస్వీఎస్‌ఎన్ వర్మ |
| రంపచోడవరం | వంతల రాజేశ్వరి |
| ఉంగటూరు | వీరాంజనేయులు |
| పెడన | కాగిత వెంకటకృష్ణ ప్రసాద్ |
| పామర్రు | ఉప్పులేటి కల్పన |
| సూళ్లూరు పేట | పర్సా వెంకటరత్నం |
| నందికొట్కూరు | బండి జయరాజు |
| బనగానపల్లె | బీసీ జనార్ధన్ రెడ్డి |
| రాయదుర్గం | కాల్వ శ్రీనివాసులు |
| ఉరవకొండ | పయ్యావుల కేశవ్ |
| తాడిపత్రి | జేసీ అస్మిత్‌రెడ్డి |
| మడకశిర | కె.ఈరన్న |
| మదనపల్లి | దమ్మలపాటి రమేష్ |
| చిత్తూరు | ఏఎస్ మనోహర్ |


