టీడీపీ పాలనను అంతం చేస్తాం : బీజేపీ | TDP Govt Reeks Of Corruption : Somu Veerraju | Sakshi
Sakshi News home page

టీడీపీ పాలనను అంతం చేస్తాం : బీజేపీ

May 6 2018 4:12 PM | Updated on Oct 22 2018 8:57 PM

TDP Govt Reeks Of Corruption : Somu Veerraju - Sakshi

సాక్షి, విజయవాడ : కర్ణాటక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయం తథ్యమని ఆపార్టీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు జోష్యం చెప్పారు. ఆదివారం మీడియాతో మాట్లాడిన ఆయన తెలుగుదేశం ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. అవినీతిని, అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి టీడీపీ నేతలు బీజేపీ ప్రభుత్వంపై అబద్ద ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. హోదా అన్న వారిపై కేసులు పెట్టి.. నేడు మాట మార్చిన ఘనత చంద్రబాబుదేనని ఆయన దుయ్యబట్టారు.

రాష్ట్రంలో పరిపాలన లేదని, మంచి పరిపాలన తెచ్చే వారితో కలిసి పోటీచేస్తామని పేర్కొన్నారు. చంద్రబాబు అసమర్థ పాలన వల్లే నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయని, సాధారణ పౌరుడి నోట్లోకి రెండు పూటలా ఐదువేళ్లు వెల్లడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అవినీతిలో కూరుకు పోయిన టీడీపీ పరిపాలనను అంతం చేస్తామని, మంచి పరిపాలన వచ్చేలా రూలింగ్ చేస్తామని సోము వీర్రాజు అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement