కూకట్‌పల్లి టీడీపీ అభ్యర్థిగా నందమూరి సుహాసిని | Suhasini as Kukatpalli TDP candidate | Sakshi
Sakshi News home page

Nov 16 2018 1:35 AM | Updated on Nov 16 2018 8:13 PM

Suhasini as Kukatpalli TDP candidate - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలుగుదేశం పార్టీ మరో స్థానానికి అభ్యర్థిని ఎంపిక చేసింది. కూకట్‌పల్లి అసెంబ్లీ నియోజకవర్గానికి నందమూరి హరికృష్ణ కుమార్తె సుహాసినిని అభ్యర్థిగా ఖరారు చేస్తూ ప్రకటన విడుదల చేసింది. వాస్తవానికి ఈ స్థానాన్ని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు పెద్దిరెడ్డి ఆశించారు.

తనకే టికెట్‌ వస్తుందనే ఆలోచనతో ఆయన ఎన్నికల ప్రచారానికి కూడా శ్రీకారం చుట్టారు. కానీ, టీడీపీ అధినేత చంద్రబాబు.. నందమూరి కుటుంబం పేరుతో పెద్దిరెడ్డికి మొండిచేయి చూపించారు. ఇదే స్థానాన్ని ఆశిస్తున్న మరో నేత మందాడి శ్రీనివాసరావును కూడా బుజ్జగించి సుహాసినికి టికెట్‌ కేటాయించారు. కాగా, సుహాసిని 17వ తేదీన నామినేషన్‌ దాఖలు చేస్తారని సమాచారం. సుహాసిని అభ్యర్థిత్వాన్ని ప్రకటించడంతో టీడీపీ ఇప్పటివరకు 12 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసినట్టయింది.  

Advertisement
 
Advertisement
Advertisement