బీజేపీని ఎదుర్కొనే శక్తి మాకే ఉంది: ఏచూరి | sitaram yechury on bjp | Sakshi
Sakshi News home page

బీజేపీని ఎదుర్కొనే శక్తి మాకే ఉంది: ఏచూరి

Oct 18 2017 2:10 AM | Updated on Oct 18 2017 2:10 AM

sitaram yechury on bjp

సాక్షి, న్యూఢిల్లీ: కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని ఎదుర్కొనే శక్తి సీపీఎంకే ఉందని, ఆ విషయం తెలిసే బీజేపీ తమపై దాడులకు పాల్పడుతోందని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. దేశవ్యాప్తంగా సీపీఎం కార్యాలయాల ముందు బీజేపీ ధర్నాలకు పిలుపునివ్వడానికి ప్రతిచర్యగా సీపీఎం ఆధ్వర్యంలో మంగళవారం ఢిల్లీలోని బీజేపీ కార్యాలయానికి ర్యాలీ చేపట్టారు.

వీపీ హౌస్‌ నుంచి ప్రారంభించిన ఈ ర్యాలీని బీజేపీ కార్యాలయం ఉన్న అశోకా రోడ్డు వద్ద పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఏచూరి మీడియాతో మాట్లాడుతూ.. కేరళ, త్రిపురలో వామపక్షాలు బలంగా ఉన్నాయి కాబట్టే బీజేపీ తమపై దాడులు చేస్తోందని విమర్శించారు. 

Advertisement
 
Advertisement
Advertisement