పిచ్చోడి చేతిలో రాయిలా పాలన: షబ్బీర్‌ అలీ | Shabbir ali commented over kcr | Sakshi
Sakshi News home page

పిచ్చోడి చేతిలో రాయిలా పాలన: షబ్బీర్‌ అలీ

Aug 22 2018 1:43 AM | Updated on Aug 22 2018 1:43 AM

Shabbir ali commented over kcr - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో పాలన పిచ్చోడి చేతిలో రాయిలా సాగుతోందని మండ లిలో విపక్షనేత షబ్బీర్‌ అలీ వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌ను డల్లాస్‌ చేస్తా, ఇస్తాంబుల్‌ చేస్తా అని పెద్దపెద్ద మాటలు చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇప్పుడు హైదరాబాద్‌ రోడ్లపై నడిస్తే నగరం ఎలా తయారయిందో అర్థమవుతుందని ఎద్దేవా చేశారు.

ప్రజాచైతన్య బస్సుయాత్ర కమిటీ సమావేశం అనంతరం పార్టీ నేతలు మహేశ్వర్‌రెడ్డి, దయాసాగర్‌లతో కలసి ఆయన మంగళవారం గాంధీభవన్‌లో విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ అభివృద్ధి అయిందని గొప్పలు చెప్పుకుంటున్న సీఎం, మంత్రి కేటీఆర్‌ల నిర్వాకానికి హైదరాబాద్‌ రోడ్లే నిద ర్శనంగా నిలుస్తున్నాయని చెప్పారు. పాలనలో విఫలమైన కేసీఆర్, కేటీఆర్‌లు వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు.

బ్రిటన్‌ కమిషనరేట్‌ అధికారులతో ఉత్తమ్‌ భేటీ
సాక్షి, హైదరాబాద్‌: టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని బ్రిటన్‌ కమిషనరేట్‌ అధికారులు మంగళ వారం మర్యాదపూర్వ కంగా కలిశారు. బ్రిటిష్‌ మినిస్టర్‌ కౌన్సిలర్, ప్రెస్‌ విభాగాల అధిపతి కైరెన్‌ డ్రాకె, బ్రిటిష్‌ డిప్యూటీ హైకమిషనర్‌ ఆండ్రూ ఫ్లెమింగ్‌లు గాంధీ భవన్‌లో ఉత్తమ్‌తో భేటీ అయ్యారు. భేటీలో పలు రాజకీయ అంశాలను చర్చించినట్టు గాంధీభవన్‌ వర్గాలు వెల్లడించాయి.

బక్రీద్‌ శుభాకాంక్షలు
బక్రీద్‌ పండుగ సందర్భంగా తెలంగాణలోని ముస్లిం సోదరులకు ఉత్తమ్, ఏఐసీసీ కార్యదర్శి మహ్మద్‌సలీంలు శుభాకాంక్షలు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement