2019లోనే అసెంబ్లీ ఎన్నికలు పెడ్తారా? | Samajwadi Party ready for one nation one election | Sakshi
Sakshi News home page

2019లోనే అసెంబ్లీ ఎన్నికలు పెడ్తారా?

Jun 7 2018 4:42 AM | Updated on Aug 15 2018 2:40 PM

Samajwadi Party ready for one nation one election - Sakshi

లక్నో: ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిపాదనల్లో ఒకటైన ‘ఒకే దేశం ఒకే ఎన్నిక’కు తాము సిద్ధంగానే ఉన్నామని ఉత్తరప్రదేశ్‌లోని సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌ స్పష్టం చేశారు. అయితే, 2019లో ఉత్తరప్రదేశ్‌లో కూడా శాసనసభ, లోక్‌సభలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించడానికి మీరు సిద్ధమేనా అని బీజేపీకి ఆయన సవాలు విసిరారు. లక్నోలోని పార్టీ కార్యాలయంలో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘‘ఆధార్‌ నంబరుతో ఓటర్లను అనుసంధానించడంలోగానీ, ఒకేసారి ఎన్నికల ప్రతిపాదనపై గానీ మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. 2019లో ఒకేసారి ఎన్నికల్లో భాగంగా యూపీ శాసన సభకు కూడా ఎన్నికలు నిర్వహించమని బీజేపీని అడుగుతున్నాను’’అని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement