‘తమ్ముళ్లకు నచ్చచెప్పడానికే .. గ్రౌండ్ ప్రిపరేషన్‌’

Sajjala Ramakrishnareddy fires on Chandrababu - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఇన్నాళ్లు ప్రజలను మభ్యపెట్టారని, ఇప్పుడు సొంత పార్టీ కార్యకర్తలనే మభ్య పెట్టడానికి ప్రయత్నిస్తున్నారని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. ఎన్నికల ముందు, తర్వాత చంద్రబాబు తీరు దారుణంగా ఉందన్నారు. వైఎస్సార్‌సీపీ విజయం సాధించబోతుందని చంద్రబాబుకు తెలుసని, అందుకే పోలింగ్ ముందు రోజు నుంచే చంద్రబాబు పథకం ప్రకారం ఈవీఎంలపై తప్పు నెడుతూ గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారని మండిపడ్డారు.

టీడీపీ తమ్ముళ్లకు నచ్చజెప్పుకోవడానికి ఈవీఎంలపై తప్పు నెట్టాలని చంద్రబాబు చూస్తున్నారని తెలిపారు. ఎన్నికల తర్వాత హుందాగా ఉండాలని, ఆట మొదలయ్యాక అనుమానం వ్యక్తం చేయడం ఏంటని ప్రశ్నించారు. ఈవీఎంలలో పొరపాట్లు లేకుండా వీవీప్యాట్లు తీసుకొచ్చారని, చంద్రబాబు ఈసీని తప్పుబట్టడం సరికాదన్నారు. చంద్రబాబుకు హుందా తనం లేదని, నియంతలా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. కాల పరిమితి అయిపోయిన తర్వాత సమీక్షలు చేయడం ఏంటన్నారు.  చంద్రబాబు ఆటలు ఇక సాగవన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top