‘మద్యం నియంత్రణ వద్దని బాబు పోరాటం’ | Sajjala Ramakrishna Reddy Comments On Chandrababu | Sakshi
Sakshi News home page

బాబుపై సజ్జల వ్యంగ్యాస్త్రాలు

May 4 2020 9:35 PM | Updated on May 4 2020 10:06 PM

Sajjala Ramakrishna Reddy Comments On Chandrababu - Sakshi

సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపక్ష నేత నారా చంద్రబాబునా​యుడుపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘మద్యం నియంత్రణ వద్దని ఈ దేశంలో పోరాటంచేస్తున్న ఏకైక నాయకుడు చంద్రబాబు’ అంటూ ఎద్దేవా చేశారు. మద్యం ధరల మీద బాధపడుతున్న నాయకుడు ఆయనేనంటూ మండిపడ్డారు. సోమవారం ట్విటర్‌ వేదికగా సజ్జల స్పందించారు. ‘‘ పేద ప్రజలు తమ జీవితాల్ని మద్యానికి ధారబోయాలని, తమ సంపాదనను కుటుంబాల్లో చిచ్చుపెట్టే ఆ వ్యసనం కోసం ఖర్చుచేయాలని నిరంతరం కోరుకుంటున్న పార్టీ ఏదైనా ఉందంటే.. అది టీడీపీయే’’నని పేర్కొన్నారు. ( ‘చంద్రబాబు ఓర్చుకోలేకపోతున్నారు’ )

కాగా, లాక్‌డౌన్‌ సడలింపుల్లో భాగంగా సోమవారం ఉదయం నుంచి ఏపీలో మద్యం అమ్మకాలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. పెంచిన ధరలతో నేటి ఉదయం 11 గంటల నుంచి మద్యం అమ్మకాలు మొదలయ్యాయి. ధరల పెంపుపై ఎక్సైజ్‌ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌ భార్గవ స్పందిస్తూ.. మద్యం అమ్మకాలు తగ్గించేందుకే ధరలు పెంచినట్టు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement