అసమర్థుడు.. అహంకారి.. జోకర్‌! | Sakshi
Sakshi News home page

అసమర్థుడు.. అహంకారి.. జోకర్‌!

Published Wed, May 22 2019 2:13 AM

Roshan Baig Comments On Congress Leaders - Sakshi

న్యూఢిల్లీ/బెంగళూరు: కర్ణాటకలోని కాంగ్రెస్‌–జేడీఎస్‌ సంకీర్ణ ప్రభుత్వంలో రెండు పార్టీల నేతలకు పొసగని పరిస్థితులు ఒక వైపు కొనసాగుతుండగానే కాంగ్రెస్‌లో అంతర్గత కుమ్ములాటలు బహిర్గతమయ్యాయి. రాష్ట్ర పార్టీ అధ్యక్షు డు దినేశ్‌ గుండూరావు అసమర్థుడని, మాజీ సీఎం సిద్దరామయ్య అహంకారి అని, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి కేసీ వేణుగోపాల్‌ జోకర్‌ అని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత రోషన్‌ బేగ్‌ తిట్టిపోశారు. రాష్ట్రంలో జరిగిన లోక్‌సభ ఎన్ని కల్లో బీజేపీకే అత్యధిక సీట్లు దక్కుతాయంటూ ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనా వేసిన నేపథ్యంలో రోషన్‌ బేగ్‌ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. దీనిపై కాంగ్రెస్‌ పార్టీ నాయకత్వం సీరియస్‌గా స్పం దించి ఆయనకు షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది.

ఈ పరిణామాలపై బీజేపీ స్పందిస్తూ తమ పార్టీ సిద్ధాంతాలను ఆమోదించేవారిని స్వాగతిస్తామని పేర్కొంది. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, ఎమ్మెల్యే రోషన్‌ బేగ్‌ మంగళవారం బెంగళూరులో మీడియాతో మాట్లాడుతూ ‘మాజీ సీఎం సిద్ధరామయ్య హిందూ సమాజాన్ని విడదీసేందుకే లింగాయత్‌లను మరో మతంగా గుర్తింపు తెచ్చేందుకు ప్రయత్నించారు. అధికారంలో ఉండగా వక్కలిగ కులస్తులను తక్కువ చూపు చూశారు. అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో పార్టీకి 79 సీట్లు వచ్చినప్పుడే పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి వేణుగోపాల్‌ రాజీనామా చేయాల్సి ఉంది. రాహుల్‌జీని చూస్తే బాధేస్తోంది.  ప్రస్తుత పరిస్థితులకు తగ్గట్లు సర్దుకుపోవాలని, పశువుల మాదిరిగా ఉంటూ ఓటు బ్యాంకు కారాదంటూ ముస్లింలను కోరారు.  రోషన్‌ బేగ్‌ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త పరిణామాలకు దారి తీస్తుందని బీజేపీ సీనియర్‌ నేత, కేంద్రమంత్రి డీవీ సదానంద గౌడ అన్నారు. 

Advertisement
Advertisement