లోకేశ్‌కు మతి భ్రమించింది : రోజా | Roja Slams Nara Lokesh Over Unemployment | Sakshi
Sakshi News home page

లోకేశ్‌కు మతి భ్రమించింది : రోజా

Aug 8 2019 6:45 PM | Updated on Aug 8 2019 6:47 PM

Roja Slams Nara Lokesh Over Unemployment - Sakshi

సాక్షి, అనంతపురం : ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత నారా లోకేశ్‌కు మతి భ్రమించిందని ఏపీఐఐసీ చైర్‌పర్సన్‌ రోజా విమర్శించారు. ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి పేరుతో చంద్రబాబు, లోకేశ్‌లు యువతను మోసం చేశారని మండిపడ్డారు. గురువారం జిల్లాలోని పెనుకొండ ప్లాంట్‌లో కియా మోటార్స్‌ మొట్టమొదటగా తయారు చేసిన సెల్తోస్ మోడల్ కార్‌ను మార్కెట్‌లోకి విడుదల చేసే కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ కార్యక్రమం అనంతరం రోజా మీడియాతో మాట్లాడుతూ.. 4 లక్షలకు పైగా ఉద్యోగాల భర్తీ ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఘనత అన్నారు. పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే అందేలా సీఎం వైఎస్‌ జగన్‌ చట్టం చేశారని గుర్తుచేశారు. అన్ని వర్గాల ప్రజలకు అండగా సీఎం వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం పని చేస్తోందన్నారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ద్వారా యువతలో నైపుణ్యాలను పెంపొదిస్తామని చెప్పారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు టీడీపీకి లేదన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement